
📌 Key Points
- బాలు మంచం కింద రోహిణి దాక్కోవడం కలకలం రేపుతోంది, వీడియో కోసమే ఈ సాహసం!
- సూపర్ మార్కెట్‌లో నీతూతో రవిని చూసిన శోభన షాక్, ఏం చేస్తుందో చూడాలి!
- మౌనికకు పిల్లలు పుట్టరని డాక్టర్ రిపోర్ట్ వచ్చేలా నీలకంఠం కుట్ర, ప్లాన్ సక్సెస్ అవుతుందా?
- 5 వందల రూపాయల కోసం మనోజ్ పాట్లు, సీరియల్‌లో మరో ట్విస్ట్!
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఊహించని మలుపులు! బాలు మంచం కింద రోహిణి, నీతూతో రవిని చూసిన శోభన.. అసలేం జరుగుతుందో చూడాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే!
బాలు మంచం కింద రోహిణి: అసలేం జరుగుతోంది?
గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 19 ఎపిసోడ్‌లో బాలు, మీనా ముసలివాళ్లలా మారిపోతారు. మనోజ్ చనిపోయినట్లు మాట్లాడుకుంటారు. సూపర్ మార్కెట్‌లో నీతూతో రవిని చూసి షాక్ అవుతుంది శోభన. మౌనికకు పిల్లలు పుట్టరని డాక్టర్‌తో రిపోర్ట్ వచ్చేలా ప్లాన్ చేస్తాడు నీలకంఠం. 5 వందల రూపాయల కోసం మనోజ్ పాట్లు పడతాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో టెస్ట్ చేయకుంటే లోపం ఎవరి దగ్గరి ఉందో తెలియదు కదా అని సంజు అంటే తండ్రి నీలకంఠం సపోర్ట్ చేస్తాడు. దాంతో మౌనిక షాక్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఎవరికి పిల్లలు పుట్టలేదు కదా. అందుకే డౌట్ వచ్చి చేయించమని చెప్పానని నీలకంఠం అంటాడు.
నాకు మాత్రం పిల్లలు పుట్టాలని ఉండదా. ఆయన దగ్గరికి వస్తే కదా అని మౌనిక అంటుంది. వాడిని మార్చేందుకు చాలా ట్రై చేశావ్ కానీ. వాడు మారట్లేదని మౌనికను ఓదారుస్తుంది అత్త. మరోవైపు డాక్టర్‌కు కాల్ చేసిన నీలకంఠం డబ్బులు అందాయిగా, నేను చెప్పినట్లుగానే మౌనికకు పిల్లలు పుట్టరని రిపోర్ట్ వస్తుందిగా అని అంటాడు. దాంతో అవును అని డాక్టర్ చెబుతాడు.
అదే విషయం సంజుకు చెబుతాడు నీలకంఠం. అది అడ్డుపెట్టుకుని తనను ఇంట్లో వదిలేయొచ్చు. అప్పుడు, బాలు వాళ్లు ఏం చేయలేరంటాడు. మరోవైపు వచ్చిన ఆదాయం గురించి లెక్కలు వేసుకుంటారు బాలు, మీనా. ముందు చూపు లేకుండానే తాత, బామ్మ రోడ్డున పడ్డారు. మనం అలా కాకూడదు. పిల్లల మీద ఆధారపడకుండా నీకు నేను నాకు నువ్వు అనేలా ఉండాలని మీనా అంటుంది.
నీతూతో రవి: శోభన షాకింగ్ రియాక్షన్!
ఇలాగే ఉందామని మీనా అంటుంది. ఇప్పటికీ మనం పైన రూమ్ కట్టలేదు. రూమ్ లేకుండానే పిల్లలం కన్నాం. ఇక రూమ్ ఎందుకు అని బాలు అంటాడు. మీ అమ్మ కాపురం సరిగా చేయనిచ్చిందా అని మీనా అంటే.. ఈ లీలావతి చచ్చి పైన ఏ లోకంలో ఉందో అని బాలు అంటాడు. తర్వాత రియాలిటీలోకి వచ్చి ఇద్దరు నవ్వుకుంటారు.
బాలు పడుకున్న చోటుకు వచ్చిన రోహిణి వీడియో కోసం వెతుకుతుంది. ఇంతలో బాలు లేచి అయ్యో టైమ్ 8 అయింద, ఫోన్‌లో ఛార్జింగ్ లేదే అంటూ మీనాపై అరుస్తూ వెళ్లిపోతాడు బాలు. త్వరగా టిఫిన్ చేయి నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లిపోతానంటాడు బాలు. రోహిణి అటు ఇటు తిరిగితే డౌట్ వచ్చి అడుగుతాడు బాలు. కవర్ చేస్తుంది రోహిణి.
బాలు మంచం కిందే రోహిణి ఉండిపోతుంది. బాలు తల తుడుస్తుంది మీనా. అయ్యో వీళ్ల రొమాన్స్ చూడాలస్తుందని రోహిణి అనుకుంటుంది. బాలు పాట పాడుతాడు. మీనా నడుముపై బాలు చేయి వేస్తే వద్దంటుంది. దాంతో బాలు డోర్ వేస్తాడు. మరోవైపు రోహిణి కోసం మనోజ్ వెతుకుతాడు. ప్రభావతిని ఐదు వందలు అడుగుతాడు మనోజ్.
తన దగ్గర లేవని, సత్యంను అడగమంటుంది ప్రభావతి . మరోవైపు మీనాను పూరి తీసుకొచ్చి తినిపించమని పంపిస్తాడు బాలు. మంచం కింద ఉన్న రోహిణికి బాలు ఫోన్‌లో వీడియో దొరుకుతుంది. పంపించుకోవాలని చూసేలోపు ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుంది. ఇప్పుడెలా అని కంగారుపడుతుంది రోహిణి. కింద రోహిణి కోసం మనోజ్ వెతుకుతుంటాడు.
మౌనికకు పిల్లలు పుట్టరా? నీలకంఠం ప్లాన్!
తర్వాత ఫోన్ కోసం బాలు వెతుకుతాడు. మంచం కింద పడిందేమో అని మీనా అంటే.. అదేమైనా బాల్ ఆ అని బాలు అంటాడు. బాలు, మీనా కిందకు వెళ్తారు. వెంటనే మంచం కిందనుంచి లేచి తీసిన చోట పెట్టి వెళ్లిపోతుంది రోహిణి. కింద ఫోన్ కోసం బాలు అడుగుతుంటే మనోజ్‌ను చూసి వీడే ఐదు వందల కోసం నొక్కి ఉంటాడని బాలు అంటాడు.
మీనా వచ్చి ఫోన్ అక్కడే ఉందని ఇస్తుంది. రవి ఉన్న సూపర్ మార్కెట్‌లోకి నీతూ వస్తుంది. రెస్టారెంట్‌లో అన్ని ఓల్డ్‌గా ఉన్నాయని డిషెస్ చూస్తారు అని నీతూ అంటుంది. ఇద్దరు కలిసి ప్లేట్స్ చూస్తారు. అక్కడికి శ్రుతి తల్లి శోభన వస్తుంది. వాళ్లిద్దరిని చూసి ఎవరామ్మాయి అని డౌట్ పడుతుంది శోభన . అత్తను చూసిన రవి వెళ్లి పలకరిస్తాడు.
మరోవైపు శివ మార్పు గురించి పార్వతి, సుమతి సంతోషిస్తారు. ఇంతలో మీనా వస్తుంది. శివకు ఐదు వందలు ఇస్తుంది మీనా. అవి తీసుకుని శివ ఫ్రెండ్ బైక్‌పై వెళ్లిపోతాడు. ఇంతలో ఒకావిడ వచ్చి తన కూతురుకు కవలలు పుట్టారని, ఇంట్లో బొమ్మలకొలువు పెట్టినందుకే పిల్లలు పుట్టారని చెబుతుంది.
నువ్వు కూడా బొమ్మల కొలువు పెట్టొచ్చుగా అని మీనా తో అంటాడు పంతులు. తనకు ఈ మధ్య ఏం బాగుండట్లేదు అని పార్వతి అంటే.. బొమ్మల కొలువు పెట్టు. నీకు కూడా పిల్లలు కలుగుతారు అని పంతులు నమ్మకంగా చెబుతాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


