
📌 Key Points
- ఏపీ, తెలంగాణలో మార్చి 16 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం
- తెలంగాణలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు
- ఏపీలో ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు
- రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం
భానుడి ప్రతాపం పెరగడంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హాఫ్ డే స్కూల్స్‌ను ప్రారంభించాయి. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు మధ్యాహ్నం ఎండల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.
తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపం పెరుగుతున్న క్రమంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఒంటి పూట బడులను నడుపుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పెరిగిన ఎండల కారణంగా హాఫ్ డే స్కూళ్లు ప్రారంభం అయ్యాయి.
అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 16 నుండి హాఫ్-డే పాఠశాల సమయాలు అమలు చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం ఏప్రిల్ 23న ముగియనుంది. రెండు రాష్ట్రాలలోని పాఠశాల లకు చివరి పని దినం కావడంతో ఒండిపూట బడులు ప్రారంభం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్
తెలంగాణ లో పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, విద్యార్థులను ఇంటికి పంపే ముందు మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలు ఈ సమయాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎటువంటి మినహాయింపులు ఇవ్వరని, మధ్యాహ్నం సెషన్ తర్వాత పాఠశాలలు మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు.
2026-27 విద్యా సంవత్సరానికి వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి ప్రారంభమవుతాయని, జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యా శాఖ ప్రకటించింది.
వేసవి సెలవుల ప్రకటన
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నడుస్తాయి. పాఠశాల విద్యా శాఖ మధ్యాహ్నం భోజన కార్యక్రమం కొనసాగుతుందని ఆదేశించింది. వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి ప్రారంభమవుతాయి, జూన్ 12 నుండి విద్యా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహార విషయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. జాగ్రత్తలు తీసుకున్నది. ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో రాగిజావ, మధ్యాహ్నం తరగతులు.. ముగిసిన తర్వాత మిడ్ డే మిల్స్ విద్యార్థులకు అందిస్తారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తీవ్రమైన ఎండల నుండి విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి జూన్ 12న ప్రారంభమవుతాయి.


