|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: హన్సిక, సోహెల్ ఖతూరియా విడాకులు! ఇంతలోనే ఏం జరిగింది?

Published: 11-03-2026, 8:35 AM
  • హన్సిక, సోహెల్ ఖతూరియా విడాకులను ముంబై కోర్టు మంజూరు చేసింది.
  • 2022 డిసెంబర్‌లో వీరి వివాహం రాజస్థాన్‌లో జరిగింది.
  • వివాహానంతరం అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు.
  • హన్సిక ఎటువంటి భరణం కోరలేదు, ఇద్దరూ ఆర్థిక డిమాండ్లు విరమించుకున్నారు.

హన్సిక మోత్వాని మరియు సోహెల్ ఖతూరియా అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ముంబైలోని ఫ్యామిలీ కోర్టు వీరి విడాకులను మంజూరు చేసింది. పెళ్లి తర్వాత తలెత్తిన విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

హన్సిక, సోహెల్ విడాకులకు కోర్టు అనుమతి

Hansika Motwani: హన్సిక మోత్వాని.. ఆమె భర్త సోహెల్ ఖతూరియా అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి విడాకులను మంజూరు చేసినట్టు సమాచారం. హన్సిక మోత్వాని 2022 డిసెంబర్‌లో వ్యాపారవేత్త సోహెల్ ఖతూరియాతో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి రాజస్థాన్‌లో ఘనంగా జరిగింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు.. సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే పెళ్లి తర్వాత కొంతకాలానికి వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలుస్తోంది. జీవన విధానం, ఆలోచనలు, అభిప్రాయాల్లో తేడాలు ఉండటం వల్ల తరచూ చిన్న చిన్న విషయాలపై కూడా వాదనలు జరిగేవని సమాచారం. దీంతో వారి సంబంధం క్రమంగా దూరమైందని చెబుతున్నారు.

గత ఏడాది నుంచే హన్సిక.. సోహెల్ విడిపోతారని వార్తలు వినిపించాయి. కానీ ఆ సమయంలో హన్సిక ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణ జరిపిన అనంతరం కోర్టు అధికారికంగా విడాకులను మంజూరు చేసింది.

విడాకులకు దారితీసిన కారణాలు

ఈ కేసులో హన్సిక తరఫున న్యాయవాది అద్నాన్ షైఖ్ వాదనలు వినిపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి తర్వాత కొద్దికాలం మాత్రమే ఇద్దరూ కలిసి జీవించారు. తర్వాత అభిప్రాయ భేదాలు పెరిగి సమస్యలు ఎక్కువయ్యాయని తెలిపారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హన్సిక మోత్వాని ఈ విడాకుల సమయంలో ఎలాంటి అలిమనీ లేదా ఆర్థిక పరిహారం కోరలేదు. అలాగే ఇద్దరూ కూడా ఒకరిపై మరొకరు ఎలాంటి ఆర్థిక లేదా చట్టపరమైన డిమాండ్లు చేయబోమని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు.

భరణంపై హన్సిక నిర్ణయం

2024 జూలై 2 నుంచి వీరిద్దరూ వేరువేరుగా.. జీవిస్తున్నారని కూడా కోర్టులో తెలిపినట్టు సమాచారం. వీరి వివాహ జీవితంలో పిల్లలు లేరు. ప్రస్తుతం హన్సిక మోత్వాని తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక హన్సిక చేసుకుంది తన సొంత స్నేహితురాలు మాజీ భర్తనే కావడం గమనర్హం.

హన్సిక మోత్వాని తన వైవాహిక జీవితానికి ముగింపు పలికి, తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె తదుపరి ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుదాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.