|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జివి ప్రకాష్ కుమార్ ‘హ్యాపీ రాజ్’ నుండి మాస్ ట్రీట్: ‘అద్దిరా లెక్క’ సాంగ్ తో రికార్డ్స్ బ్రేక్!

Published: 17-03-2026, 2:05 PM
  • జివి ప్రకాష్ కుమార్ డ్యాన్స్ మూమెంట్స్‌తో సాంగ్ అదిరింది!
  • జస్టిన్ ప్రభాకరన్ బీట్స్‌తో యూత్‌ను ఊపేస్తున్న ‘అద్దిరా లెక్క’!
  • మార్చి 27న గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ విడుదల!
  • ధనుష్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్!

జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘హ్యాపీ రాజ్’ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘అద్దిరా లెక్క’ పాట విడుదలైన వెంటనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు.

జివి ప్రకాష్ కుమార్ స్టెప్స్ తో దుమ్మురేపాడు!

స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’. ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో నుంచి విడుదలైన పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘అద్దిరా స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’.లెక్క’ సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అదిరిపోయే బీట్స్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌లో జివి ప్రకాష్ కుమార్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్స్ అన్నీ కలిసి సాంగ్‌ను మరింత ఎంటర్టైనింగ్‌గా మార్చాయి.

అంతే కాకుండా రిలీజ్ అయిన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ, ఇన్స్‌స్టెంట్ హిట్‌గా మారింది. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించిన ‘హ్యాపీ రాజ్’ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తమిళ వెర్షన్ ట్రైలర్‌ను తాజాగా స్టార్ హీరో ధనుష్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఈ ట్రైలర్ నెట్టింట పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

మార్చి 27న ‘హ్యాపీ రాజ్’ గ్రాండ్ రిలీజ్!

ధనుష్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్!

జివి ప్రకాష్ కుమార్ ‘హ్యాపీ రాజ్’ సినిమా మార్చి 27న విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.