
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద పోటీని ఎదుర్కొంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Key Points
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల తేదీ వాయిదా
జూన్ 12 విడుదల వాయిదా పడినట్లు ప్రకటన
జూలై 25న విడుదల అవకాశం, విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ తో పోటీ?
కొత్త విడుదల తేదీ గురువారం ప్రకటించనున్నట్లు మేకర్స్ ప్రకటన
హరిహర వీరమల్లు విడుదల తేదీ వాయిదా
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈనెలలో విడుదల కావాల్సినా ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నెలలోనే థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడడం.. పెద్దగా బజ్ లేకపోవడంతో హరిహర వీరమల్లుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు. ఇక చేసేదేం లేక జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.
తాజాగా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మూవీ విడుదల తేదీని గురువారం ప్రకటిస్తామని పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో కాస్తా ఆశలు చిగురించాయి. అయితే ఈ నెల చివరి వారంలో బాక్సాఫీస్ వద్దకు రానుందా..వచ్చే నెలలో రిలీజ్ కానుందా? అనేది రేపు క్లారిటీ రానుంది.
కింగ్‌డమ్ తో పోటీ?
అయితే మరో వైపు జూలై 25న థియేటర్లలో రానుందని సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ మూవీ కింగ్‌డమ్ విడుదల కానుంది. ఆ డేట్ కనుక ఖరారైతే బాక్సాఫీస్ వద్ద కింగ్‌డమ్‌తో హరిహర వీరమల్లు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
కొత్త విడుదల తేదీ ఎప్పుడు?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ నెలకొంది. జూలై 25న విడుదలైతే కింగ్‌డమ్ తో పోటీ తప్పదని అనిపిస్తుంది. రేపు క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.


