|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి హరి హర వీరమల్లు.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్.. నెల రోజుల్లోపే.. మూడు భాషల్లో..

Published: 19-08-2025, 1:21 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనూహ్యంగా ఆగస్టు 20 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మూడు భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది.

Key Points

1

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఓటీటీలోకి!

2

ఆగస్టు 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.

4

థియేట్రికల్ విడుదల తర్వాత నెల రోజుల్లోనే ఓటీటీ ప్రవేశం.

హరి హర వీరమల్లు ఓటీటీ విడుదల తేదీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ నటించిన హరి హర వీరమల్లు మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ వారం చివర్లో లేదంటే వచ్చే వారం ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని భావించినా.. బుధవారం (ఆగస్టు 20) నుంచే మూవీ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇది ఒకరకంగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

హరి హర వీరమల్లు మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అభిమానులకు సడెన్ షాకిస్తూ ఈ సినిమాను బుధవారం (ఆగస్టు 20) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విషయాన్ని మూవీలోని ఫిమేల్ లీడ్ నిధి అగర్వాల్ తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించింది.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్

“థియేటర్లలో మీరు కురిపించిన ప్రేమ, అభిమానం తర్వాత ఇప్పుడు ఈ ఎపిక్ సాగా హరి హర వీరమల్లు ఓటీటీ స్క్రీన్లను ఏలడానికి సిద్ధమైంది. ప్రైమ్ వీడియోలో చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. దీనికి జోడించిన పోస్టర్లో ఆగస్టు 20 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా ఉంది. నిజానికి ఆగస్టుల 22 నుంచి వస్తుందని అందరూ భావించినా.. రెండు రోజుల ముందే రానుండటం విశేషం.

అటు ఈ సినిమా అఫీషియల్ ఎక్స్ అకౌంట్ కూడా మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. “తిరుగుబాటు, ఆగ్రహం, నీతికి సంబంధించిన కథ ఇది. థియేటర్లలో మొదలైన ఈ తుఫాను ఇప్పుడు మీ స్క్రిన్లను తాకనుంది. హరి హర వీరమల్లు స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ఆగస్టు 20 నుంచి ప్రైమ్ వీడియోలో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

మూడు భాషల్లో విడుదల

హరి హర వీరమల్లు మూవీ జులై 24న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ సాధించినా మూవీకి వచ్చిన నెగటివ్ రివ్యూలతో తర్వాత కలెక్షన్లు భారీగా పతనమయ్యాయి. దీంతో నెల రోజుల్లోపే మూవీ ఓటీటీలోకి రాబోతోంది. బుధవారం (ఆగస్టు 20) నుంచే మూవీ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టబోతోంది.

పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ నటించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాకు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మూవీకి చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి.

చివరగా, హరి హర వీరమల్లు సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.