
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ జూలై 3న విడుదల కానుంది. 3 నిమిషాలకు పైగా ఉండే ఈ ట్రైలర్‌కు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా సెన్సార్ పూర్తయింది.
Key Points
హరిహర వీరమల్లు ట్రైలర్ జూలై 3న విడుదల.
ట్రైలర్ 3 నిమిషాలకు పైగా ఉంటుంది.
సినిమా ఈనెల చివరిలో విడుదల కానుంది.
హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల తేదీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా… ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. అతి త్వరలోనే రిలీజ్ కానుంది హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పిరియాడిక్ సినిమాగా… ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెరుగనుంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం అంటే జూలై మూడో తేదీన… హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. రేపు ఉదయం 11:10 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
ట్రైలర్ వ్యవధి
అయితే ఇలాంటి నేపథ్యంలో మరో కీలక అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. హరిహర వీరమల్లు ట్రైలర్ 3:01 నిమిషాల పాటు ఉంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ పోస్టును కూడా వదిలింది. దీంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా హరిహర వీరమల్లు సినిమా సెన్సార్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ట్రైలర్ విడుదల అవుతున్న నేపథ్యంలో అంచనాలు కూడా సినిమాపై భారీగా పెరిగాయి. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ఈనెల ఆఖరుకు రిలీజ్ కానుంది.
సినిమా విడుదల తేదీ
Just one look is enough to know what’s coming 🤩💥⚔️🔥 #HHVMTrailer #HariHaraVeeraMallu pic.twitter.com/tpt0wBY9Ds
హరిహర వీరమల్లు ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. 3 నిమిషాలకు పైగా ఉండే ట్రైలర్‌తో అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా ఈ నెల చివరిలో విడుదల కానుంది.


