|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

BREAKING: పవర్ స్టార్ తర్వాత మెగాస్టార్ టార్గెట్! హరీష్ శంకర్ సంచలన ప్లాన్! చిరు షాక్!

Published: 17-03-2026, 7:05 AM
BREAKING: పవర్ స్టార్ తర్వాత మెగాస్టార్ టార్గెట్! హరీష్ శంకర్ సంచలన ప్లాన్! చిరు షాక్!
  • పవన్ కళ్యాణ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమాకి హరీష్ శంకర్ సన్నాహాలు!
  • చిరుతో రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి మాస్ ఎంటర్టైనర్ తీస్తానన్న హరీష్.
  • ఇటీవలే చిరంజీవిని కలిసిన హరీష్ శంకర్, సినిమాపై చర్చలు.
  • యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న చిరు.. హరీష్ కి ఛాన్స్ ఇస్తారా?

టాలీవుడ్ లో ఒక సంచలనం! డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ తర్వాత, చిరుతో ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి.

పవన్ కళ్యాణ్ తర్వాత చిరుతో సినిమా?

Harish Shankar : హరీష్ శంకర్ తీసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నారు. హరీష్ తీసిన సినిమాల్లో మూడు సినిమాలు తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్ సినిమాలే. ఇక పవన్ కళ్యాణ్ కి అయితే గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. కానీ హరీష్ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమాతో అతనిపై తీవ్ర నెగిటివిటి వచ్చింది.

గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ – పవన్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మరోసారి హరీష్ రేంజ్ పెరగడం ఖాయం. ఉస్తాద్ తర్వాత హరీష్ నెక్స్ట్ సినిమా ఏంటి అని చర్చ మొదలయింది.

రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లాంటి మాస్ మూవీ!

తాజాగా హరీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో సినిమా ప్రాసెస్ లో ఉంది. చిరంజీవితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ఆయనతో రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి మాస్ ఎంటర్టైనర్ సినిమా చేస్తాను. చిరంజీవి గారిని పలుమార్లు కలిసాను అని తెలిపారు.

దీంతో ఉస్తాద్ తర్వాత హరీష్ చిరంజీవి సినిమానే చేస్తారేమో అని చర్చ మొదలయింది. గతంలో చిరంజీవితో ఓ యాడ్ డైరెక్ట్ చేసాడు హరీష్ శంకర్. అప్పుడు చిరు నుంచి హరీష్ కి మంచి ప్రశంసలే వచ్చాయి. అయితే చిరంజీవి ఇటీవలే మన శంకర వరప్రసాద్ సినిమాతో భారీ హిట్ కొట్టారు. లైనప్ కూడా యువ దర్శకులతో క్రేజీగా ప్లాన్ చేసుకుంటున్నారు చిరు. ఆల్రెడీ ఓకే చేసిన కొన్ని సినిమాలని కూడా పక్కన పెట్టేసారు చిరు.

చిరంజీవి ఛాన్స్ ఇస్తారా?

మరి ఇలాంటి సమయంలో చిరంజీవి హరీష్ శంకర్ కి ఛాన్స్ ఇస్తారా? హరీష్ తన కథతో చిరుని మెప్పిస్తారా చూడాలి. ఆల్రెడీ హరీష్ శంకర్ మెగా ఫ్యామిలిలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లతో సినిమాలు చేసారు.

హరీష్ శంకర్, చిరంజీవి కాంబో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.