|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: తేరి రీమేక్ కాదు.. గబ్బర్ సింగ్ నుంచే కాపీ కొట్టారు! హరీష్ శంకర్ సంచలన ప్రకటన!

Published: 02-03-2026, 9:05 AM
షాకింగ్: తేరి రీమేక్ కాదు.. గబ్బర్ సింగ్ నుంచే కాపీ కొట్టారు! హరీష్ శంకర్ సంచలన ప్రకటన!
  • ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదల కానుందని ప్రకటన!
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు
  • గబ్బర్ సింగ్ సినిమాలోని అంత్యాక్షరి సీన్ నుంచే తేరి కాపీ చేశారన్న హరీష్ శంకర్
  • తేరి రీమేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక సంచలన వార్త! ఈ సినిమా తేరి రీమేక్ కాదట! అసలు విషయం ఏమిటో చూద్దాం.

ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు

Harish Shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26 విడుదల కానుంది. ఈ సినిమా ప్రకటించినప్పుడు తమిళ్ హీరో విజయ్ తేరి సినిమా రీమేక్ అన్నారు. కానీ సినిమా వాయిదా పడటం, ఎన్నికలు రావడం, ఎలక్షన్స్ లో పవన్ గెలవడంతో ఈ కథని, కథనాన్ని మార్చేశారు.

అయినా ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ తో ఈ సినిమా తేరి రీమేక్ అనే పలువురు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూ చేసారు. ఆల్రెడీ గతంలోనే హరీష్ శంకర్ ఇది తేరి రీమేక్ కాదన్నా ఈ ఇంటర్వ్యూలో మరోసారి దీనిపై స్పందించాడు.

తేరి రీమేక్ వార్తలపై హరీష్ క్లారిటీ

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ సినిమా రీమేక్ కి నేను మార్పులు – దర్శకత్వం అని పేరు వేసుకున్నా. కానీ ఈ సినిమాకు కథ మాటలు దర్శకత్వం అని పేరు వేసుకుంటే రీమేక్ అంటారేంటి. తేరి రీమేక్ అనుకున్నాం కానీ కాదు. మొత్తం కథ కొత్తది.

గబ్బర్ సింగ్ సీన్ కాపీ కొట్టిన తేరి?

గబ్బర్ సింగ్ సినిమాలో నేను పెట్టిన అంత్యాక్షరి సీన్ తీసుకొని తేరి లో అలాంటి సీన్ పెట్టారు. గబ్బర్ సింగ్ సినిమాని ఇన్ స్పైర్ తీసుకొని తేరిలో రౌడీలతో రైమ్స్ చెప్పిస్తాడు హీరో. నా సినిమాలోని సీన్స్ నే కాపీ చేసి తేరి చేస్తే నన్ను తేరి రీమేక్ చేస్తున్నావంటున్నారు. ఇంక నేనేం సమాధానం చెప్తాను అని అన్నారు.

హరీష్ శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.