|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. ఇంత పద్ధతిగా ఉంటే కష్టం అంటున్న నెటిజన్లు

Published: 08-05-2025, 6:24 AM
చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. ఇంత పద్ధతిగా ఉంటే కష్టం అంటున్న నెటిజన్లు

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో పాపులర్ అయిన హెబ్బా పటేల్, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పర్పుల్ చీరలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Key Points

1

హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పర్పుల్ చీరలో ఫోటోలు పోస్ట్ చేసింది.

2

ఫోటోల్లో హెబ్బా చాలా పద్ధతిగా కనిపిస్తోంది.

4

హెబ్బా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హెబ్బా పటేల్‌ యొక్క తాజా ఫోటోలు

‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

నెటిజన్ల ప్రతిస్పందనలు

తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో పర్పుల్ కలర్ చీరలో పద్ధతిగా రెడీ అయింది. నడుము కూడా కనిపించనంతగా ట్రెడిషనల్‌గా రెడీ అయింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు హెబ్బా అంటే అబ్బా అనేలా ఉండాలి.. ఇలా పద్ధతిగా ఉంటే కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

Hebah Patel (@ihebahp) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

హెబ్బా పటేల్ యొక్క సరళమైన అందం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు ఆమెకు మరింత అభిమానులను సంపాదించి పెట్టాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.