|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్న హెబ్బా పటేల్.. పండుగ వైల్డ్‌గా మారిందంటూ పోస్టర్ రిలీజ్

Published: 04-10-2025, 10:37 AM
యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్న హెబ్బా పటేల్.. పండుగ వైల్డ్‌గా మారిందంటూ పోస్టర్ రిలీజ్

హెబ్బా పటేల్ తన కొత్త సినిమా ‘మారియో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఒక యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దసరా పండుగను మరింత వైల్డ్‌గా మార్చనుందని హెబ్బా పటేల్ తెలిపింది.

Key Points

1

హెబ్బా పటేల్ 'మారియో' అనే యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను ప్రకటించింది.

2

ఈ చిత్రంలో అనిరుధ్ హీరోగా నటిస్తుండగా, కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వం వహిస్తున్నారు.

4

దసరా పండుగకు ఈ సినిమా విడుదల కానుందని, హెబ్బా పటేల్ చాలా వైల్డ్‌గా పేర్కొంది.

‘మారియో’ చిత్రంలో హెబ్బా పటేల్

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్(Hebba Patel) ఇటీవల ‘ఓదెల-2’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈక్రమంలో.. తాజాగా, హెబ్బా పటేల్ కొత్త సినిమాను ప్రకటించింది. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘మారియో’(Mario)మూవీతో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌ చిత్రంగా రాబోతుండగా.. ఇందులో అనిరుధ్ (Anirudh)హీరోగా నటిస్తున్నాడు. నాటకం, తీస్ మార్ ఖాన్ వంటి చిత్రాలు చేసిన దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ తెరకెక్కిస్తున్నారు.

సినిమా వివరాలు, నటీనటులు

సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌లో యాక్షన్ ప్యాక్డ్, స్లైలిష్ రొమాంటిక్ వైబ్‌తో ఉండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఇందులో అనిరుధ్ రైఫిల్ పట్టుకుని ఉండగా.. హెబ్బా పటేల్ రెడ్ కలర్ దుస్తుల్లో కనిపించింది. క్లాసిక్ కారు, చీకటి వర్షం ఇలా అన్నింటినీ చూస్తుంటే థ్రిల్లర్ థిమ్‌ను సూచిస్తోంది. ఈ దసరా ‘మారియో’తో చాలా వైల్డ్‌గా మారిందని తెలిపింది. ఇక ఇందులో హెబ్బా పటేల్ చాలా బక్కగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

A post shared by Kalyanji Content Pictures (@kalyanjicontentpictures)

మొత్తంగా, హెబ్బా పటేల్, అనిరుధ్ నటిస్తున్న ‘మారియో’ చిత్రం ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా అలరించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచింది. దసరాకు విడుదల కానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.