|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి వ్యాఖ్యల్లో తప్పేముంది? హేమ ప్రశ్న.. ఏపీ రాజకీయాల్లో దుమారం!

Published: 30-03-2026, 1:05 PM
చిరంజీవి వ్యాఖ్యల్లో తప్పేముంది? హేమ ప్రశ్న.. ఏపీ రాజకీయాల్లో దుమారం!
  • చిరంజీవి వ్యాఖ్యలను కొందరు కావాలనే వివాదం చేస్తున్నారని హేమ అన్నారు.
  • కళాకారులను ఏపీ ప్రభుత్వం గౌరవించాలని హేమ కోరారు.
  • నంది అవార్డులు నిర్వహించాలని, సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలని హేమ అభిప్రాయపడ్డారు.
  • రెండు రాష్ట్రాలు మనవేనని, ప్రోత్సాహం అందించాలని హేమ అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వం గురించి చేసిన వ్యాఖ్యలపై నటి హేమ స్పందించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి వ్యాఖ్యలపై హేమ స్పందన

Actress Hema: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు కాంట్రవర్సీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మంచి విషయం చెప్పినా కూడా, దానిని కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కళాకారులను గౌరవించాలని, నంది అవార్డ్స్ (Nandi Awards) వంటి వేడుకను నిర్వహించాలని, అక్కడ కూడా సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని మెగాస్టార్ అన్నారు. దీనికి, ఆయన మాటల్లోని ఆంతర్యం అర్థం చేసుకోకుండా, చంద్రబాబుకు చెప్పేటంతటి వాడివా? అంటూ, కొందరు కావాలని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని టీడీపీకి చెందిన సానుభూతిపరులు కూడా ఈ విషయంపై ఇష్టం వచ్చినట్లుగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. చిరంజీవిపై కామెంట్స్ చేస్తున్న వారిపై తాజాగా హేమ (Actress Hema) ఫైరయ్యారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ..

నంది అవార్డుల గురించి హేమ సూచన

‘‘ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆంధ్రాలో సినిమాలు తీస్తే మేము సబ్సిడీ ఇస్తామనో, లేకపోతే ఇంకొకటనో ఇండస్ట్రీని పిలిస్తే ఆంధ్రాలో ఎందుకు చేయరండి? మేమందరం అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నామండి. అది మాదే.. ఇది మాదే.. రెండు రాష్ట్రాలు మావేనండి. చిరంజీవి అన్న ఒక మంచి మాట ఏంటంటే.. ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండి, ఇప్పుడు రెండు స్టేట్స్ అయిపోయినాయి కదా, ఆ స్టేట్‌లో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పారు. దాన్ని కూడా చిలువలు పలువలు చేసేసి, ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్ పెట్టేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలోనే దాసరి వంటి వారు ఉంటే బాగుండేది అనిపిస్తుంది’’ అని హేమ మీడియా సమావేశంలో సంచలనంగా మాట్లాడారు.

రాష్ట్ర విభజన తర్వాత పరిశ్రమ పరిస్థితి

హేమ మాటలపై కూడా కొందరు సీరియస్ అవుతున్నారు. చంద్రబాబును వ్యతిరేకించడానికి ఇంకొకరు సిద్ధమయ్యారు అంటూ వార్తలు రాస్తున్నారు. ‘సన్నాసుల్లారా.. ఇందులో వ్యతిరేకించింది ఏముంది?’ అంటూ కొందరు ఇచ్చిపడేస్తున్నారనుకోండి. అయినా సరే, పైన చిరంజీవి మాట్లాడిన విషయంలో కానీ, హేమ చెప్పిన మ్యాటర్‌లో కానీ, ఏపీ ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబు నాయుడుని కానీ విమర్శించినట్లు ఉందా? చాలా గొప్పగా వారికి అభ్యర్థన చెప్పారు. అంతే, ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు.. అంతేకానీ, ఆ కామెంట్స్, ట్రోలింగ్స్ ఏంటి? మీ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేయడానికి, ట్రోల్ చేయడానికి హక్కు ఉంది కానీ, ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాదు, అభ్యర్థించేందుకు చిరంజీవికి హక్కు లేదా? ఏం మనుషులురా.. ఇలా తయారయ్యారేంట్రా? వివి వినాయక్ చెప్పినట్లుగా.. చిరంజీవిని అన్నవాళ్లంతా పోతారు.. మొత్తం పోతారు.

చిరంజీవి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ హేమ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలని ఆమె కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.