
టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా సమయంలో తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యానని, డ్రగ్స్ కేసు తర్వాత అది మరింత పెరిగిందని తెలిపింది. ఆ సమయంలో తనకు ఎవరినైనా చంపేయాలని లేదా చచ్చిపోవాలనిపించిందని షాకింగ్ కామెంట్స్ చేసింది.
Key Points
టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది.
అరెస్ట్ చేసి జైలులో ఉంచినా, తర్వాత నిర్దోషిగా బయటపడింది.
కరోనా, డ్రగ్స్ కేసు ప్రభావంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.
ఎవరినైనా చంపేయాలని లేదా చచ్చిపోవాలనిపించిందని హేమ షాకింగ్ కామెంట్స్ చేసింది.
డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్
టాలీవుడ్ సీనియర్ నటి హేమ(hema) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అత్త, అక్క, పిన్ని, భార్య, చెల్లి వంటి పాత్రలో నటించి మెప్పించింది. చాలాకాలంగా ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్న పట్టుబడ్డారనే వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమెను అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు జైలులో కూడా ఉంచారు.
కరోనా సమయంలో డిప్రెషన్
ఈసమయంలో బెయిల్ మీద బయడకు వచ్చి.. ఈ కేసు విచారణలో భాగంగా తప్పులేదని తేలడంతో ఈ గండం నుంచి బయటపడింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పలు వీడియోలు షేర్ చేస్తోంది. తన తప్పు లేకున్నా.. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘కరోనా సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.
ప్రాణాల మీదకు తెచ్చిన ఆలోచనలు
ఆ ప్రభావం నా మీద ఉండగానే.. గత ఏడాది నా తప్పు లేకున్నా నన్ను నిందిచడంతో మరింత కృంగిపోయాను. డిప్రెషన్ ప్రభావం మరింత పెరిగింది. ఈ డిప్రెషన్ కారణంగా నాకు ఎవరినైనా చంపేయాలని.. లేదా నేనైనా చచ్చిపోవాలనే ఆలోచనలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆలోచనల నుంచి నన్ను నేను సముదాయించుకున్నా. ఆవేశం కంటే ఓపిక ముఖ్యమని గ్రహించి మెల్లగా మామూలు స్థితికి చేరుకున్నాను. ప్రస్తుతం అంతా బాగుంది’’ అని చెప్పుకొచ్చింది.
డిప్రెషన్ తీవ్రత పెరిగినప్పటికీ, ఆవేశం కంటే ఓపిక ముఖ్యమని గ్రహించి తాను మామూలు స్థితికి చేరుకున్నానని హేమ తెలిపింది. తనలాంటి వారు ధైర్యంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అంతా బాగుందని ఆమె వెల్లడించింది.


