|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అర్ధరాత్రి యాంకర్ స్రవంతికి హీరో ఫోన్.. ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ అడిగి మరీ!

Published: 18-02-2026, 11:35 PM
షాకింగ్: అర్ధరాత్రి యాంకర్ స్రవంతికి హీరో ఫోన్.. ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ అడిగి మరీ!
  • యాంకర్ స్రవంతికి అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన హీరో, Instagramలో నెంబర్ అడిగి మరీ సంభాషణ!
  • స్రవంతి పనితనాన్ని మెచ్చుకుంటూ రాయలసీమ అమ్మాయిల సక్సెస్‌పై హీరో ప్రశంసలు కురిపించారు.
  • స్రవంతిని పొగడ్తలతో ముంచెత్తిన ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని నెటిజన్ల ఆసక్తి, చర్చలు మొదలు!
  • హే బల్‌వంత్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్రవంతి తన అనుభవాన్ని పంచుకున్నారు.

యాంకర్ స్రవంతి గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరో స్వయంగా ఆమెకు అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడారట. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా!

స్రవంతికి అర్ధరాత్రి ఫోన్ చేసిన హీరో ఎవరు?

Anchor Sravanthi : యాంకర్ గా ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న స్రవంతి ఇప్పుడు నటిగా మారి సినిమాలు చేస్తుంది. తను కీలక పాత్రలో నటించిన హే బల్‌వంత్ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్రవంతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Anchor Sravanthi)

ఈ క్రమంలో తనకు అర్ధరాత్రి 12 గంటలు ఓ హీరో కాల్ చేసి తన వర్క్ గురించి పొగిడాడు అని చెప్పుకొచ్చింది.

స్రవంతి పనితనంపై హీరో ప్రశంసలు!

యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. రీసెంట్ గా ఒక సినిమా ఈవెంట్ చేశాను. ఈవెంట్ లేట్ గా అయింది. ఈవెంట్ అయ్యాక రాత్రి 12 గంటలకు ఆ సినిమా హీరో నాకు ఇన్‌స్టాగ్రామ్ లో.. ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయండి అని మెసేజ్ పెట్టారు. ఆయన గురించి నేను ఏం తప్పు మాట్లాడలేదు కదా అని కంగారు పడ్డాను. ఈవెంట్ బాగానే చేశాను కదా అని అనుకున్నా. సరే అని నా నంబర్ పెట్టి రేపు కాల్ చేస్తాను అని చెప్పాను. కానీ నెంబర్ పెట్టగానే ఆయన వెంటనే కాల్ చేసారు.

నేను లిఫ్ట్ చేస్తే మీరు ఈవెంట్ చాలా బాగా హ్యండిల్ చేసారు. నేను ఎప్పుడూ గమనించను. నేను మొదట్లో చూసిన స్రవంతికి ఇప్పుడు చూసే స్రవంతి చాలా మారింది. చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని, మీ వర్క్ ని చూస్తే అన్నారు. రాయలసీమ నుంచి అక్కడనుంచి వచ్చిన అమ్మాయిలు ఇలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ అని అన్నారు. అలా ఆయన చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. మనం బాగున్నాం అనేదానికంటే మన వర్క్ బాగుందని పొగడటంతో ఫుల్ హ్యాపీ అనిపించింది, సంతృప్తిగా అనిపించింది. నేను హీరో పేరు మాత్రం చెప్పను అని తెలిపింది.

హే బల్‌వంత్ సినిమా ప్రమోషన్స్‌లో స్రవంతి

అర్ధరాత్రి 12 గంటలకు కాల్ చేసి మరీ యాంకర్ వర్క్ ని అభినందించిన హీరో ఎవరా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

స్రవంతికి అర్ధరాత్రి ఫోన్ చేసిన హీరో ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే ఆ హీరో పేరు బయటపడుతుంది!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.