|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ షాక్: శోభనం రాత్రి బొద్దింకను నమిలేసిన హీరో! టీఆర్పీ కోసం ఇంత దారుణమా?

Published: 08-07-2026, 8:59 AM

బుల్లితెరపై సృష్టించిన సంచలనం గురించి తెలుసా? ఒక సీరియల్‌లో హీరో చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శోభనం రాత్రి అస్సలు ఊహించని సంఘటనతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. టీఆర్పీ కోసం లాజిక్‌ను పక్కనపెట్టిన ఈ సీన్ వివరాలు ఇక్కడ!

Key Points

1

కమలా నివాస్ సీరియల్‌లో షాకింగ్ శోభనం దృశ్యం.

2

హీరో పాలల్లో బొద్దింకను ముంచి తినేసి సంచలనం.

4

ఈ వైరల్ వీడియో దేశవ్యాప్తంగా ట్రెండింగ్.

టీఆర్పీ కోసం లాజిక్ పక్కన పెట్టారా?

Kamala Nivas Serial First Night Cockroach Scene: బుల్లితెర సీరియల్స్‌లో టీఆర్‌పీ రేటింగుల కోసం దర్శకులు లాజిక్‌ను పక్కనపెట్టడమే కాకుండా జుగుప్సాకరమైన సీన్లను పెడుతున్నారు. తాజాగా ఒక సీరియల్‌లో హీరో శోభనం రాత్రి పాలల్లో బొద్దింకను ముంచి నమిమిలి తినే సీన్ చూసి వీక్షకులు తలలు పట్టుకుంటున్నారు.

Kamala Nivas Serial First Night Cockroach Scene: కొన్నిసార్లు బుల్లితెర పై వచ్చే రోజువారీ సీరియల్స్ కొన్నిసార్లు ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తే.. మరికొన్నిసార్లు అస్సలు నమ్మశక్యం కాని వింత సీన్లతో షాక్‌కు గురిచేస్తుంటాయి. రేటింగుల వేటలో పడి కథకులు, దర్శకులు లాజిక్‌కు పూర్తిగా పాతర వేస్తున్నారు.

కథ ప్రకారం హీరో, హీరోయిన్లు పెళ్లయిన తర్వాత మొదటి రాత్రి గదిలోకి అడుగుపెడతారు. ఇద్దరూ ముచ్చటించుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఒక బొద్దింక వచ్చి భార్యను కుడుతుంది. దాంతో ఆమె భయంతో గట్టిగా అరుస్తుంది. తన భార్యను కుట్టి, తమ శోభనం ముచ్చట్లకు అడ్డుపడిందనే కోపంతో హీరోకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది.

బొద్దింక సీన్‌పై సోషల్ మీడియాలో రచ్చ!

వెంటనే ఆ బొద్దింకను చేత్తో పట్టుకుంటాడు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న పాల గ్లాసులో ఆ బొద్దింకను ముంచి, భార్య చూస్తుండగానే నోట్లో వేసుకుని నమిలేస్తాడు. ఈ సీన్ చూసి ఆ భార్యతో పాటు టీవీల ముందున్న ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు.

“సీరియల్స్‌లో భార్యపై ప్రేమను చూపించడానికి ఇప్పుడు బొద్దింకలను కూడా తినాలా? ఈ దారుణాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు” అని ఒక వీక్షకుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

భార్య ప్రేమకు ఇదేనా నిదర్శనం?

“ఆ సీన్‌ను విరాజ్ దోబ్రియాల్ ఇంతకంటే బాగా చేశాడు” అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలో ఉన్నది బొద్దింక కాదని, ఓరియో బిస్కెట్ అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు.

వివాదాల సంగతి పక్కనబెడితే, ఈ ఒక్క సీన్‌తో ఈ బెంగాలీ సీరియల్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఈ సీరియల్ వివాదంపై సోషల్ మీడియాలో రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. బుల్లితెరపై ఇలాంటి దారుణమైన సీన్లు అవసరమా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని సంచలన వార్తల కోసం మాతోనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.