
ప్రదీప్ రంగనాథన్‌ను ‘హీరో మెటీరియల్’ కాదన్న వివాదంపై నాగార్జున బిగ్ బాస్‌లో స్పందించారు. ప్రదీప్‌ను రజనీకాంత్, ధనుష్‌లతో పోలుస్తూ ‘రియల్ హీరో’ అంటూ ప్రశంసలు కురిపించారు. ‘డ్యూడ్’ సినిమా ప్రమోషన్స్‌లో నాగార్జున వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Key Points
"మీరు హీరో మెటీరియలా కాదా?" అనే ప్రశ్నతో ప్రారంభమైన వివాదం.
డ్యూడ్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
బిగ్ బాస్‌లో ప్రదీప్‌ను రజనీకాంత్, ధనుష్‌తో పోల్చి ప్రశంసించిన నాగార్జున.
గ్లామర్ ముఖ్యం కాదు, టాలెంట్ ఉంటే హీరో కావచ్చునని నాగార్జున వ్యాఖ్య.
హీరో మెటీరియల్ వివాదం: డ్యూడ్ ప్రమోషన్స్ నేపథ్యం
“మీరు హీరో మెటిరీయల్ కాదు. కానీ, ఇలా జరగడం హార్డ్ వర్కా లేక అదృష్టమా?” అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా హీరో మెటీరియల్ టాపిక్ వివాదంగా కూడా మారింది. నిజానికి ఇది డ్యూడ్ అనే మూవీ ప్రమోషన్స్‌లో జరిగిన సంఘటన.
లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఇలా అడిగిన ప్రశ్న ఇది. దానికి శరత్ కుమార్ ఘాటుగా, ప్రదీప్ రంగనాథన్ కూల్‌గా తెలివిగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు.
అయితే, ఈ టాపిక్ కాంట్రవర్సీ అవ్వడం, దీనిపై కిరణ్ అబ్బవరం కూడా స్పందించడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ రియల్ హీరో అంటూ కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జున చేస్తున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్‌లో నాగార్జున ప్రశంసలు: రజనీకాంత్, ధనుష్‌తో పోలిక
అక్టోబర్ 12 ఆదివారం నాడు బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ 2.O నిర్వహించి కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్స్‌ను రాయల్ ఎంట్రీగా పంపారు. ఈ క్రమంలోనే డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్‌లోకి అతిథులుగా ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు , నటుడు శరత్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌజ్‌లో ప్రదీప్ రంగనాథన్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్‌తో పోలుస్తూ ప్రశంశలు కురిపించారు నాగార్జున. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగార్జున వ్యాఖ్యలు: ప్రదీప్ స్పందన
“కొన్ని దశాబ్ధాల క్రితం గ్లామర్‌తో సంబంధం లేకుండా ఒక మెరుపు తీగ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా మారాడు. ఆయనే రజనీకాంత్ . ఆ తర్వాత బక్కగా ఉండే ఓ కుర్రాడు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారి శభాష్ అనిపించుకున్నాడు. అతనే ధనుష్ . ఇక ఇప్పుడు ఈ జనరేషన్‌లో డైరెక్టర్‌గా అడుగుపెట్టి నటుడిగా సూపర్ బ్లాక్ బస్టర్స్ అందుకుని హీరో అవ్వాలంటే గ్లామర్‌తో పని లేదు టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించావ్ ప్రదీప్. నువ్వు రియల్ హీరోవి” అని నాగార్జున అన్నారు.
దానికి ప్రదీప్ రంగనాథన్ చాలా సంతోషించాడు. “మీ నుంచి ఇంతటి కాంప్లిమెంట్ తీసుకోవడం నా అదృష్టం” అని ప్రదీప్ రంగనాథన్ బదులిచ్చాడు. ఆ తర్వాత రాక్షసుడు సినిమా చూసి నాగార్జునలా తాను హెయిర్ పెంచుకున్నట్లు తెలిపాడు ప్రదీప్ రంగనాథన్.
నాగార్జున ప్రశంసలు ప్రదీప్‌కు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. టాలెంట్ ఉంటే ఎవరైనా హీరోలు కావచ్చునని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. ఈ కామెంట్స్ చిత్ర పరిశ్రమలో టాలెంట్ ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేశాయి.


