
బిగ్‌బాస్ తెలుగు షోలో సరికొత్త సందడి మొదలైంది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి రానున్నాయి. ఈ సందర్భంగా అతిథులుగా వచ్చిన ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు, హీరో ప్రదీప్ రంగనాథన్‌లు ఆకట్టుకున్నారు. ప్రదీప్ చాలా డేంజరని మమిత, నాగార్జునకు కంప్లైంట్ చేసింది.
Key Points
బిగ్‌బాస్ తెలుగులోకి ఆరుగురు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ.
అతిథులుగా వచ్చిన డ్యూడ్ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు.
ప్రదీప్ చాలా డేంజరని నాగార్జునకు కంప్లైంట్ చేసిన 'ప్రేమలు' బ్యూటీ మమిత.
దివ్వెల మాధురి, రమ్య మోక్ష సహా కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు.
బిగ్‌బాస్ తెలుగులో వైల్డ్‌కార్డ్ సందడి
బిగ్‌బాస్ షో ( Bigg Boss Telugu 9 ) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్‌బాస్ షో కు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్‌బాస్‌ల హోస్ట్‌లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు.
ప్రదీప్ చాలా డేంజర్ పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్‌లు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి!
ప్రేమలు బ్యూటీ మమిత సంచలన కంప్లైంట్
హౌస్‌లోకి అడుగుపెట్టనున్న కొత్త కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. మమిత చేసిన ఈ ఆసక్తికరమైన కంప్లైంట్, ప్రదీప్ స్పందన ఈ రోజు ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచింది. మరి రానున్న రోజుల్లో షో ఎలా మారుతుందో చూడాలి.


