
📌 Key Points
- హీరో యష్ బాడీగార్డ్ శ్రీనివాస్ నెలకి రూ. 10.5 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
- శ్రీనివాస్ ఏడాదికి రూ. 1.26 కోట్లు పారితోషికం అందుకుంటూ అత్యధిక వేతనం పొందే బాడీగార్డ్స్‌లో ఒకరిగా నిలిచారు.
- శ్రీనివాస్ యష్‌కు బహిరంగ కార్యక్రమాలు, సినిమా ప్రమోషన్లలో భద్రత కల్పిస్తూ అండగా ఉంటున్నారు.
- కేజిఎఫ్ సినిమాతో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
కన్నడ హీరో యష్ బాడీగార్డ్ శ్రీనివాస్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీనివాస్ నెలకి రూ. 10.5 లక్షలు తీసుకుంటుండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
శ్రీనివాస్ రెమ్యూనరేషన్ వివరాలు
Hero Yash: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్లు కాబట్టి.. వారు ప్రజలలోకి వచ్చారు అంటే కచ్చితంగా తమను తాము కాపాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరితో కరచాలనం చేయాలి అని , వీరితో మాట్లాడాలని , సెల్ఫీ దిగాలని, అభిమానులు తెగ ఎగబడతారు. ఇక అభిమానుల దాటికి తట్టుకోవాలి అంటే సెలబ్రిటీలు తమను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తమకంటూ ప్రత్యేకంగా సెక్యూరిటీని కూడా నియమించుకుంటున్న విషయం తెలిసిందే . అయితే ఈ సెక్యూరిటీని నియమించుకోవడమే కాదు.. అందరూ ఆశ్చర్యపోయేలా రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరో యష్ బాడీగార్డ్ కు సంబంధించిన రెమ్యూనరేషన్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.
ప్రముఖ హీరో యష్ తన వ్యక్తిగత బాడీగార్డ్ అయిన శ్రీనివాస్ (Srinivas ) కోసం నెలకి సుమారుగా 10.5 లక్షలు ఇస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే ఏడాదికి 1.26 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారని తెలిసి వీరు ముందు సాఫ్ట్వేర్లు కూడా పనికిరారే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు భారతదేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే సెలబ్రిటీ బాడీగార్డ్ లలో ఒకరిగా శ్రీనివాస్ స్థానం సంపాదించుకున్నారు. బహిరంగ కార్యక్రమాలు, సినిమా ప్రమోషన్లతోపాటు ప్రముఖులతో హాజరైనప్పుడు కూడా శ్రీనివాస్ యశ్ తో పాటు నిరంతరం కనిపిస్తూ, పటిష్టమైన భద్రతను, జన సమూహ నియంత్రణ చేస్తూ యష్ కు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారు. ఇకపోతే సెలబ్రిటీ భద్రత అనేది కేవలం రక్షణ కల్పించడం మాత్రమే కాదు సెలబ్రిటీల భారీ అభిమానుల నుంచీ బహిరంగ ప్రచారాలలో జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట వెయ్యడం.. అందుకే స్టార్డం పెరిగే కొద్దీ అత్యంత శిక్షణ పొందిన , పటిష్టమైన అనుభవం ఉన్న, విశ్వసనీయమైన భద్రత నిపుణుల అవసరం కూడా పెరుగుతోంది.
యష్‌కు శ్రీనివాస్ భద్రత
కేజిఎఫ్ తో యష్ పాపులారిటీ
ఒకప్పుడు కన్నడలో పలు యాడ్స్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. టీవీ సీరియల్స్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ పేరు దక్కించుకున్న ఈయన.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ ఒక్క సినిమా ఆయనకు ఊహించని స్టార్ డం ను అందించింది. ఇక ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ 2 సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని రికార్డులు క్రియేట్ చేసిన ఈయన ప్రస్తుతం గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా చేస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా , రుక్మిణి వసంత్ ఇలా మొత్తం 8 మందికి పైగా హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య మార్చి 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా .. పలు కారణాలవల్ల సినిమాను వాయిదా వేశారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీషులో ఏకకాలంలో రిలీజ్ చేస్తూ.. మిగతా భాషలలో డబ్బింగ్ వెర్షన్ లలో రిలీజ్ చేయనున్నారు.
మొత్తానికి హీరో యష్ బాడీగార్డ్ శ్రీనివాస్ భారీ జీతం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సెలబ్రిటీల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ విషయం తెలియజేస్తుంది.


