|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హిట్ కాంబోలో భారీ ప్రాజెక్ట్.. బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందంటూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Published: 06-07-2025, 10:17 AM

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మరో సినిమా చేయనున్నారు. ‘ఇఫ్ మిడిల్ ఫింగర్ వాస్ ఏ మ్యాన్’ అనే పోస్టర్‌ను విడుదల చేసి, జూలై 9న బిగ్ అనౌన్స్‌మెంట్ చేస్తామని ప్రకటించారు.

Key Points

1

సిద్దు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబో మరో సినిమాతో సందడి చేయనుంది.

2

జూలై 9న సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రానుంది.

4

‘బ్యాడాస్’ అనే టైటిల్‌తో సినిమా రాబోతున్నట్లు వార్తలు.

సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘ఇఫ్ మిడిల్ ఫింగర్ వాస్ ఏ మ్యాన్’ (If Middle Finger Was a Man)అని రాసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ జూలై 9న రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు (Ravikanth Perepu)దర్శకత్వం వహిస్తుండగా.. ‘బ్యాడాస్’(Badass) టైటిల్‌తో రాబోతున్నట్లు టాక్. ఈ సినిమా సినీ పరిశ్రమ గురించి తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బోల్డ్‌గా ఉండనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటన

జూలై 9న బిగ్ అప్డేట్

సిద్దు జొన్నలగడ్డ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబో సినిమాపై అంచనాలు పెరిగాయి. జూలై 9న వచ్చే అప్డేట్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.