
‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. నిర్మాత శైలేష్ కొలను, ఊహించని విధంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారని వెల్లడించారు. నాని నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని ఆయన అన్నారు.
Key Points
నిర్మాతల అంచనాలను మించి కుటుంబ ప్రేక్షకులు ‘హిట్: ది థర్డ్ కేస్’ చూస్తున్నారు.
నాని అర్జున్ సర్కార్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘హిట్ 3’ క్లైమాక్స్‌లో అడివి శేష్ కనిపిస్తారని శైలేష్ కొలను వెల్లడించారు.
‘హిట్ 4’లో కార్తి హీరోగా నటించనున్నారు.
‘హిట్: ది థర్డ్ కేస్’కు అనుకోని స్పందన
‘‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాకి ఒక వర్గం ప్రేక్షకులే వస్తారనుకున్నాం. గత రెండు రోజులుగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాం. చాలామంది మహిళలు రావడం గమనించాం. నానీగారిని అర్జున్ సర్కార్‌లాంటి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి ఎగ్జైట్‌మెంట్‌తో వస్తున్నారనిపించింది. మా అంచనాలను దాటి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందన సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది’’ అని శైలేష్ కొలను చెప్పారు. నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల1న విడుదలైంది. ఈ సందర్భంగా శైలేష్ కొలను చెప్పిన విశేషాలు…
∙‘హిట్: ది థర్డ్ కేస్’లో అర్జున్ సర్కార్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో ‘హిట్ 2’ చివర్లో గ్లింప్స్‌లా చూపించా. అప్పుడే ఆడియన్స్‌కి ఓ అవగాహన వచ్చింది. అర్జున్ సర్కార్ పాత్రపై నాకు, నానీగారికి మొదటినుంచీ నమ్మకం ఉంది. ఇక మా మూవీ ఐడియాని చాగంటి కోటేశ్వరరావుగారికి చెబితే నచ్చి, వాయిస్ ఓవర్ ఇచ్చారు. డార్క్ వెబ్ అనేది ప్రస్తుతం ఇండియాలో పెద్ద సమస్య. ఎన్నో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైబర్ డిపార్ట్‌మెంట్ దీని మీద వర్క్ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు డార్క్ వెబ్ గురించి మాకు చాలా సమాచారం ఇచ్చారు.
నాని పాత్ర ప్రేక్షకుల ఆకర్షణ
∙‘హిట్ 3’ క్లైమాక్స్‌లో అడివి శేష్ కనిపిస్తారు. విశ్వక్ సేన్‌ని ఇంకా బిగ్గర్ కాన్వాస్‌లో చూపించాలనే ఈ మూవీలో చేయించలేదు. ‘హిట్ 6’ లేదా ‘హిట్ 7’లో అందరి హీరోల్ని ఒక ఫ్రేమ్‌లోకి తీసుకురావాలని ఉంది.
భవిష్యత్తు ‘హిట్’ సినిమాల గురించి
∙‘హిట్ 4’లో హీరో కార్తీగారు నటిస్తారు. ఆ పాత్ర రూడ్‌గా, ఫన్‌గా ఉంటుంది. ఇక నాలో ఉన్న వినోదాన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చేలా ఓ రొమాంటిక్ కామెడీ స్టోరీ రాయాలని ఉంది.
‘హిట్’ సిరీస్ కొనసాగింపు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన శైలేష్ కొలను, కుటుంబ ప్రేక్షకుల స్పందనతో సంతోషం వ్యక్తం చేశారు. హిట్ 4, 6 లకు సంబంధించి ఆయన చెప్పిన వివరాలు సినిమా ప్రేమికులను ఆసక్తిగా ఉంచుతున్నాయి.


