
నాని పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ పై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ర్యాన్ రేనాల్డ్స్ భాగం కావడంతో సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది.
Key Points
నాని 'ది ప్యారడైజ్' సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
హాలీవుడ్ నటుడు ర్యాన్ రేనాల్డ్స్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
నాని డ్యూయల్ రోల్‌లో, జడలు వేసుకుని అత్యంత భయంకరంగా కనిపించనున్నారు.
ఈ సినిమా ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ విడుదలై అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యంగా పెట్టుకుంది.
నాని ‘ది ప్యారడైజ్’: భారీ అంచనాలు
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో సక్సెస్ అయిన హీరోలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన నాని, నిర్మాతగా అలాగే పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నారు. అయితే అలాంటి నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ ( The Paradise) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ కొడుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇందులో నాని డ్యూయల్ రోల్ ఉంటుందని చెబుతున్నారు. జడలు వేసుకుని, అత్యంత భయంకరంగా నాని ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. ఊర మాస్ భాష ఈ సినిమాలో వాడినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాను ఇంగ్లీష్ తో పాటు స్పానిష్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకే అంతర్జాతీయంగా ఈ సినిమాకు పాపులారిటీ రావాలని ఈ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ నటుడిని రంగంలోకి దించుతున్నారట. ఇందులో భాగంగానే ర్యాన్ రేనాల్డ్స్ ను ( Ryan Reynolds) సినిమాలోకి తీసుకువస్తున్నారట.
సినిమాలోకి హాలీవుడ్ నటుడు ర్యాన్ రేనాల్డ్స్
ప్రపంచవ్యాప్తంగా విడుదల, నాని డ్యూయల్ రోల్
హాలీవుడ్ స్టార్ రాకతో ‘ది ప్యారడైజ్’ చిత్రం భారీ మాస్ జాతరగా మారడం ఖాయం. నాని కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలవనుంది, అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.


