|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హనీ కిడ్స్: 100% VFX తో సినిమా.. ‘హనీ కిడ్స్’ ఫస్ట్ పోస్టర్ రిలీజ్

Published: 14-06-2025, 8:34 AM
హనీ కిడ్స్: 100% VFX తో సినిమా.. ‘హనీ కిడ్స్’ ఫస్ట్ పోస్టర్ రిలీజ్

తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘హనీ కిడ్స్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. భారతదేశంలోనే తొలి 100% VFX ఆధారిత సినిమా ఇది. స్వప్న చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.

Key Points

1

100% VFX తో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం 'హనీ కిడ్స్'

2

స్వప్న చౌదరి అమ్మినేని హీరోయిన్ గా నటిస్తున్నారు

4

ఫస్ట్ పోస్టర్ విడుదలైంది

‘హనీ కిడ్స్’ సినిమా విశేషాలు

Honey Kids : తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలో భీమవరం టాకీస్ బ్యానర్ పై హర్ష.ఎం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హనీ కిడ్స్’. ఈ సినిమాలో తల్లాడ సాయికృష్ణ, అమ్మినేని స్వప్నా చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్, వినోద్ నువ్వుల, కృష్ణ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాని భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100 శాతం VFX ఆధారిత సినిమాగా, ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని ఓ కొత్త లోకం సృష్టించి తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం VFX వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

100% VFX తో కొత్త ప్రయోగం

ఫస్ట్ పోస్టర్ విడుదల

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ గా హీరోయిన్ స్వప్న చౌదరి అమ్మినేని పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో హీరోయిన్ సూపర్ వుమెన్ లా ఉంది. ఈ మేరకు స్వప్న చౌదరి మాట్లాడుతూ.. ఈ జానర్ సినిమా పిల్లలకు బాగా నచ్చుతుందని తెలిపింది.

‘హనీ కిడ్స్’ సినిమా షూటింగ్ పూర్తయి, VFX వర్క్స్ జరుగుతున్నాయి. పిల్లలకు బాగా నచ్చే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.