
📌 Key Points
- ఇరాన్-అమెరికా ఘర్షణల తర్వాత హోర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
- సోమవారం 40 నౌకలు ప్రయాణించగా, గత వారం ఒక రోజున 76 నౌకలు ఈ మార్గం గుండా వెళ్లాయి.
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆక్రమిత లెబనాన్ భూభాగాన్ని సందర్శించి కీలక వ్యాఖ్యలు చేశారు.
- హిజ్బుల్లా ముప్పు ఉన్నంత కాలం లెబనాన్ నుండి వెనక్కి వెళ్లబోమని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలు సద్దుమణగడంతో హోర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు తిరిగి పుంజుకున్నాయి. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆక్రమిత లెబనాన్ భూభాగాన్ని సందర్శించి, హిజ్బుల్లా ముప్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా సాగుతున్నాయి.
హోర్మూజ్‌లో నౌకల రాకపోకలు పునరుద్ధరణ
ఇరాన్, అమెరికా దేశాల మధ్య మళ్లీ ఘర్షణలు పెరగడంతో నిలిచిపోయిన హార్ముజ్ జలసంధిలో నౌక రాకపోకలు సోమవారం నాటికి తిరిగి పుంజుకున్నాయి. మెరిటైమ్ ట్రాకింగ్ సంస్థ అయిన కెప్లర్ అందించిన డేటా ప్రకారం.. సోమవారం నాడు 40 నౌకలు ఈ జలసంధి ద్వారా ప్రయాణించాయి. అంతకుముందు రోజు ఆదివారం ఈ సంఖ్య కేవలం 24 గా ఉండగా, శనివారం 39 నౌకలు ప్రయాణించాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పాటు, యుద్ధానికి ముగింపు పలికేలా 60 రోజుల పాటు చర్చలు జరపాలని ఇరు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో గత వారం నుండి నౌకలు భారీగా ఈ మార్గంలో ప్రయాణం ప్రారంభించాయి. చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి గుండా గత బుధవారం ఏకంగా 76 నౌకలు ప్రయాణించాయి. మార్చి 1 తర్వాత ఈ స్థాయిలో నౌకలు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి చివరి వారంలో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడి చేసిన తర్వాత, ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేసింది. దీని వల్ల పర్షియన్ గల్ఫ్‌లో వందలాది నౌకలు నిలిచిపోయాయి. కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో తమ తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న మార్గాన్ని మాత్రమే నౌకలు ఉపయోగించాలని ఇరాన్ పట్టుబడుతోంది. అయితే చాలా నౌకలు ఇరాన్ నిబంధనలను పాటిస్తుండగా, మరికొన్ని నౌకలు ఒమన్ తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. వీటికి అమెరికా సైన్యం సహాయం అందిస్తోంది.
ఇరాన్-అమెరికా కాల్పుల విరమణ ప్రభావం
ఆక్రమిత లెబనాన్‌ను విడిచి వెళ్లబోం : నెతన్యాహు
నెతన్యాహు లెబనాన్ పర్యటన: హిజ్బుల్లాపై హెచ్చరిక
ఇజ్రాయెల్ సైన్యం ఆధీనంలో ఉన్న లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ సపోర్ట్ ఉన్న హిజ్బుల్లా నుండి ముప్పు ఉన్నంత కాలం ఆక్రమిత దక్షిణ లెబనాన్ ప్రాంతం నుండి ఇజ్రాయెల్ వెనక్కి వెళ్లబోదని స్పష్టం చేశారు. ‘హిజ్బుల్లా ఆయుధాలతో ఇక్కడే ఉంటూ మనకు ముప్పుగా ఉన్నంత కాలం, మనం కూడా ఇక్కడే ఉంటాము’ ఆయన సైనికులతో అన్నారు. హిజ్బుల్లా వద్ద ఇంకా సుమారు 12,000 రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని తెలిపారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం 9,000 మంది ఉగ్రవాదులను హతమార్చిందని వెల్లడించారు. అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాల మధ్య గత శుక్రవారం ఒక భద్రతా ఒప్పందం కుదిరిన తర్వాత ఆక్రమిత లెబనాన్ భూభాగంలో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ రెండు ప్రాంతాలను లెబనాన్ సైన్యానికి అప్పగించాల్సి ఉంది. కాగా.. ఈ పర్యటనలో నెతన్యాహుతో పాటు రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఉన్నత సైనిక అధికారులు కూడా పాల్గొన్నారు.
హోర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు పుంజుకోవడం ప్రపంచ వాణిజ్యానికి శుభసూచకం. అయితే, ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు, హిజ్బుల్లాపై నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతికి సవాళ్లు విసురుతున్నాయి.


