
రిషబ్ శెట్టి నటుడు, దర్శకుడు, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి. కాంతార చాప్టర్ 1 విజయంతో ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అయితే, కాంతారకు ముందు రిషబ్ దర్శకత్వంలో వచ్చిన అనేక బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల గురించి చాలా మందికి తెలియదు. ఆ సినిమాల వివరాలు ఇక్కడ.
Key Points
రిషబ్ శెట్టి తొలి దర్శకత్వ సినిమా 'రికీ' ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
రష్మిక మందన్నను పరిచయం చేసిన 'కిరిక్ పార్టీ' సూపర్ హిట్. జియోసినిమా, హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
'సర్కారీ హి. ప్రా. శాలే' కన్నడ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది, సన్ నెక్స్ట్ ఓటీటీలో ఉంది.
రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'కాంతార' రూ.400 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
రిషబ్ శెట్టి తొలి దర్శకత్వ చిత్రం: రికీ
రిషబ్ శెట్టి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడు, దర్శకుడు, రచయితగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన కొనసాగుతున్నాడు. రిషబ్ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను పొందుతోంది. ఈ బ్లాక్‌బస్టర్ విజయం మధ్యలో, రిషబ్ శెట్టి దర్శకత్వంలో మీరు తప్పక చూడాల్సిన సినిమాల గురించి చూద్దాం.
రికీ, ఇది రిషబ్ శెట్టి ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన కన్నడ సినిమా. ఇందులో ఆయన తమ్ముడు రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. హరిప్రియ ప్రముఖ పాత్రలో నటించింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఒక సాధారణ అమ్మాయి నక్సలైట్‌గా మారే కథ. ప్రేమను కాపాడుకోవడానికి ప్రియుడు ఏం చేస్తాడో చెప్పే అందమైన కథ. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
బాక్సాఫీస్ సంచలనం కిరిక్ పార్టీ
రిషబ్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో కిరిక్ పార్టీ ఒకటి. కాలేజీ జీవితంలో జరిగే సంఘటనలు, కామెడీ, లవ్, యాక్షన్, ఎమోషన్స్ ను కలగలిపిన తీసిన అందమైన కథ. ఈ సినిమాలో రక్షిత్ శెట్టికి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఇది ఒక సూపర్ హిట్ సినిమా. ఈ సినిమాతోనే రష్మిక మందన్న హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా ప్రస్తుతం జియోసినిమా, హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈసినిమాను మరికొన్ని భాషల్లో రీమేక్ కూడా చేశారు.
Sarkari Hi. Pra. Shale, Kasaragodu కన్నడ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఒక అందమైన సినిమా. ఇది సరిహద్దు ప్రాంతాల్లోని కన్నడ పాఠశాలల సమస్యలను రిషబ్ శెట్టి ఈసినిమాతో కళ్లకు కట్టినట్టు చూపించాడు . ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
జాతీయ అవార్డు గెలిచిన సర్కారీ హి. ప్రా. శాలే
రిషబ్ శెట్టిని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టిన సినిమా కాంతార. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ నటించారు. ఇది కన్నడ సినిమా కాగా దేశవ్యాప్తంగా సందడి చేసింది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా, గిరిజన ప్రజల దేవడి గురించి వివరిస్తుంది. గిరిజనులను అప్పటి పెద్ద కుటుంబాలు ఎలా చూశాయో చెబుతుంది. ఈ సినిమాను రిషబ్ శెట్టి 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా ఓవర్ ఆల్ గా 400 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
కాంతార చాప్టర్ 1 విడుదలై ఐదు రోజులైంది. రాష్ట్రంలోనే కాకుండా, విదేశాల్లోనూ సినిమాకు మంచి ఆధరణ లభించింది. సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్, నటన అన్నీ అద్భుతంగా ఉన్నాయి. రిషబ్ శెట్టి దర్శకత్వం, నటన ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇక ప్రస్తుతం థియేటర్లలో కాంతార ఫీవర్ పట్టుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈసినిమా 300 కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటేసింది. 1000 కోట్లు వసూలు చేస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
కాంతార విజయానికి ముందే రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభ రికీ, కిరిక్ పార్టీ, సర్కారీ హి. ప్రా. శాలే వంటి చిత్రాలతో నిరూపితమైంది. ఈ సినిమాలు ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం, తద్వారా కాంతార విజయం కేవలం ఆరంభం మాత్రమే అని స్పష్టం చేస్తున్నాయి.


