|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇలాంటి క్లైమాక్స్ మాత్రం చూసిండ‌రు – ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి తెలుగు హీరోయిన్‌ మ‌ల‌యాళం హార‌ర్ మూవీ ‘హంట్’

Published: 08-05-2025, 12:49 AM

మలయాళ హారర్ సినిమా ‘హంట్’ ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. తెలుగు హీరోయిన్ భావన నటించిన ఈ సినిమా, మనోరమ మ్యాక్స్‌లో మే 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Key Points

1

ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి 'హంట్' సినిమా రాకం

2

భావన హీరోయిన్‌గా నటించిన మలయాళ హారర్ థ్రిల్లర్

3

క్లైమాక్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన

4

మే 23 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్

‘హంట్’ సినిమా ఓటీటీ విడుదల

మ‌ల‌యాళం హార‌ర్ మూవీ హంట్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌, స్ట్రీమింగ్ డేట్ క‌న్ఫామ్ అయ్యాయి. మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో మే 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

భావ‌న హీరోయిన్‌గా న‌టించిన హంట్ మూవీలో రెంజీ ఫ‌ణిక్క‌ర్‌, అజ్మ‌ల్ అమీర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ హార‌ర్ మూవీకి మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాజీ కైలాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాన్సెప్ట్ రొటీన్ అయినా నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లే ఈ మూవీని తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని అనుకున్నారు ద‌ర్శ‌కుడు షాజీ కైలాస్.. కానీ ఈ ప్ర‌యోగం అంత‌గా స‌క్సెస్ కాలేదు.

కానీ ట్విస్ట్‌ల‌తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం బాగుంద‌నే కామెంట్స్ వ‌చ్చాయి. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఇదివ‌ర‌కు చూడ‌ని క్లైమాక్స్ అంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వినిపించాయి. భావ‌న యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.గ‌త ఏడాది ఆగ‌స్ట్ లో హంట్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.

భావన నటనకు ప్రశంసలు

కీర్తి (భావ‌న‌) ఫోరెన్సిక్ స్టూడెంట్‌. పోలీసుల‌కు గుర్తుతెలియ‌ని ఓ డెడ్‌బాడీ దొరుకుతుంది. ఈ మ‌ర్డ‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్‌లో కీర్తి సాయాన్ని కోరుతారు పోలీసులు.ఆ చ‌నిపోయిన అమ్మాయి సారా అనే నిజాన్ని క‌నిపెడుతుంది కీర్తి. సారా ఎలా చ‌నిపోయింది? ఆమె మ‌ర‌ణానికి కీర్తి బాస్‌కు సంబంధం ఏమిటి? సారా ఆత్మ కీర్తి వెంట‌ప‌డ‌టానికి కార‌ణం ఏమిటి? సారా మ‌ర‌ణం గురించి కీర్తికి ఎలాంటి నిజాలు తెలిశాయి? అన్న‌దే హంట్ మూవీ క‌థ‌.

గ‌తంలో భావ‌న‌, షాజీ కైలాస్ కాంబోలో వ‌చ్చిన చింతామ‌ణి కోలాకేస్ పెద్ద హిట్ట‌య్యింది. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి హంట్ మూవీ చేశారు. ఈ హిట్టును మాత్రం కొన‌సాగించ‌లేక‌పోయారు. యి.

కథాంశం మరియు విశేషాలు

గ‌త కొన్నేళ్లుగా మ‌ల‌యాళం లో థ్రిల్ల‌ర్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది భావ‌న‌. ఆమె హీరోయిన్‌గా థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌ల‌తో వ‌చ్చిన కేస్ ఆఫ్ కొండ‌న్న‌, రెయిన్ ది రియ‌ల్ స్టోరీ, గోవిందా గోవిందా ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇటీవ‌లే ది డోర్ అనే హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో పింక్ నోట్‌, ఉత్త‌ర కాండ తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తోంది.

మ‌ల‌యాళం టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న భావ‌న తెలుగులో ఒంట‌రి, కృష్ణ‌వంశీ మ‌హాత్మ‌తో పాటు ర‌వితేజ నిప్పు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. హంట్ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన అజ్మ‌ల్ అమీర్ తెలుగులో ర‌చ్చ‌, మంగ‌ళ‌వారంతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు.

మొత్తం మీద, ‘హంట్’ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఓటీటీలో దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.