|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐబొమ్మ రవి రీఎంట్రీ: టాలీవుడ్ లో ప్రకంపనలు! ఆ నిర్మాతకు ఇక కష్టకాలమేనా?

Published: 11-04-2026, 12:35 PM
  • ఐబొమ్మ రవి మళ్ళీ తెరపైకి: సోషల్ మీడియాలో సంచలనం, నిర్మాతలకు టెన్షన్!
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టార్గెట్: ఐబొమ్మ రవి ట్వీట్ వైరల్, నెటిజన్ల కామెంట్స్!
  • టిజి విశ్వప్రసాద్ పై ట్రోల్స్: రాజా సాబ్ డిజాస్టర్, భారీ నష్టాలు!
  • సాఫ్ట్ వేర్ డబ్బులు తగలేస్తున్నారా?: విశ్వప్రసాద్ పై విమర్శలు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్లాపులే ఎక్కువ!

టాలీవుడ్ లో సంచలనం! ఐబొమ్మ రవి మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఒకప్పుడు పైరసీతో ఇండస్ట్రీని వణికించిన రవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అసలేం జరుగుతుందో చూద్దాం!

ఐబొమ్మ రవి మళ్ళీ యాక్టివా?

టాలీవుడ్ మొత్తాన్ని ఐబొమ్మ రవి ఒక కుదుపు కుదిపేశాడు. విదేశాల్లో ఉంటూ సినిమా పైరసీ చేస్తూ కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నాడు. చాలా కాలం పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న రవి ఎట్టకేలకు కొన్ని నెలల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో తమ వద్ద ఎవరి ఆటలు సాగవు అని హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ మెసేజ్ పంపారు.

అయితే రవి చివరికి బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే మళ్ళీ రవి యాక్టివ్ అయ్యాడా అనే ప్రచారం మొదలైంది. మునుపటిలా సినిమాలు పైరసీ చేయడం లేదు కానీ ఐబొమ్మ రవి పేరుతో సోషల్ మీడియాలో ఒక ఖాతా యాక్టివ్ గా ఉంది. అది ఫేక్ అకౌంటా ? లేక రవినే యాక్టివ్ అయ్యాడా అనేది క్లారిటీ లేదు.

కానీ ఆ ఎక్స్ ఖాతా నుంచి మాత్రం వరుసగా ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. టాలీవుడ్ కి సంబంధించిన గాసిప్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రవి పేరు, ఫోటో తో ఉన్న ఆ అకౌంట్ ని దాదాపు 6 వేలమంది ఫాలో అవుతున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టార్గెట్!

ఈ ఖాతా నుంచి వచ్చిన ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది. ఈ ట్వీట్ లో టాలీవుడ్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ని టార్గెట్ చేశారు. ఆయన ఫోటో, ఆయన నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫోటో పెట్టు కన్నీళ్లు కారుస్తున్న ఎమోజి పెట్టారు. దీనికింద నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కథ ముగిసినట్లేనా అని అంటున్నారు.

🥲 pic.twitter.com/6lhpTxOBa3

నెటిజన్ల కామెంట్స్ వైరల్!

— ibomma Ravi (@ibomma_Ravi) April 11, 2026

పీపుల్ మీడియా సంస్థ ప్రారంభించినప్పటి నుంచి విజయాల శాతం చాలా తక్కువ. టిజి విశ్వప్రసాద్ గారికి హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి. చివరగా నిర్మించిన రాజా సాబ్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. మరికొందరు నెటిజన్లు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుని విశ్వప్రసాద్ ఫిలిం ఇండస్ట్రీలో తగలేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐబొమ్మ రవి వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.