|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తండ్రి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి తర్వాత మొదటిసారిగా నోరువిప్పిన ఇబ్రహీం అలీ ఖాన్.. పోస్ట్ వైరల్

Published: 12-05-2025, 9:40 AM
తండ్రి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి తర్వాత మొదటిసారిగా నోరువిప్పిన ఇబ్రహీం అలీ ఖాన్.. పోస్ట్ వైరల్

నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తి దాడి తర్వాత ఆయన కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. దాడి రాత్రి జరిగిన సంఘటనల గురించి, తన భావోద్వేగాలను ఆయన వెల్లడించాడు.

Key Points

1

సైఫ్ అలీ ఖాన్ పై దాడి గురించి ఇబ్రహీం తొలిసారిగా మాట్లాడాడు.

2

దాడి సమయంలో ఇబ్రహీం షూటింగ్ లో ఉన్నాడు.

4

ఈ సంఘటన తరువాత ఇబ్రహీం తన తండ్రికి మరింత దగ్గరయ్యాడు.

ఇబ్రహీం అలీ ఖాన్ వివరణ

తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ పై దారుణంగా కత్తితో దాడి జరిగిన రాత్రి గురించి ఇబ్రహీం అలీ ఖాన్ తొలిసారిగా నోరు విప్పాడు. ఈ సంఘటన కుటుంబాన్ని కుదిపేసిందని చెప్పుకొచ్చారు. దాడి జరిగినప్పుడు తాను నైట్ షిఫ్ట్ షూటింగ్ చేస్తున్నానని ఇబ్రహీం గుర్తు చేసుకున్నాడు.“అది తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగిందని వెల్లడించారు.

నాకు తెల్లవారుజామున 5:30 గంటలకు మాత్రమే సమాచారం అందిందని చెప్పుకొచ్చారు. నేను ఆ రాత్రి నిద్రపోలేదని పేర్కొన్నాడు. నేను అతనిని చూడటానికి పరుగెత్తానని.. అతను శస్త్రచికిత్స తర్వాత అప్పుడే బయటకు వచ్చాడు అని అతను పంచుకున్నాడు. కానీ సైఫ్ తరువాత చెప్పినదే అతనిని బాధించినట్లు పేర్కొన్నారు.

దాడి రాత్రి సంఘటనలు

అతను కళ్ళు తెరిచి సారాతో మాట్లాడి, ఆపై నన్ను అడిగాడని తెలిపాడు. నేను ఇక్కడే ఉన్నాను నాన్న అని నేను చెప్పినప్పుడు అతను నవ్వి, నవ్వు అక్కడ ఉంటే, ఆ వ్యక్తిని కొట్టేవాడివి అని అన్నారని చెప్పుకొచ్చాడు. మరణానికి దగ్గరైన అనుభవం తనను తన తండ్రికి మానసికంగా దగ్గర చేసిందని ఇబ్రహీం అన్నారు. ఇలాంటి వాటి తర్వాత మీరు ప్రజలను తేలికగా తీసుకోవడం మానేశాడని చెప్పుకొచ్చాడు.

తండ్రి కుమారుని మధ్య బంధం

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

ఈ ఘటన ఇబ్రహీం అలీ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. జీవితం ఎంతో విలువైనదని ఈ సంఘటన వారిద్దరికీ తెలియజేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.