|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

“ఇడుపు కాయితం” వివాదంపై తిరువీర్ సంచలనం! “ఫ్రీ పబ్లిసిటీ దొరికింది” అంటూ షాకింగ్ కామెంట్స్!

Published: 18-07-2026, 12:40 AM

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ “ఇడుపు కాయితం” టైటిల్ వివాదం! ఈ రచ్చపై హీరో తిరువీర్ స్పందించిన తీరు ఇప్పుడు సంచలనం రేపుతోంది. తనదైన శైలిలో తిరువీర్ చేసిన వ్యాఖ్యలు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు ఇక్కడ!

Key Points

1

‘ఇడుపు కాయితం’ టైటిల్ వివాదంపై హీరో తిరువీర్ తొలిసారిగా స్పందించారు.

2

“ఫ్రీ పబ్లిసిటీ దొరికింది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తిరువీర్.

4

‘పరేషాన్’ సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంటూ వివాదాన్ని కొట్టిపారేశారు.

‘ఇడుపు కాయితం’ వివాదంపై తిరువీర్ ధీమా!

‘ఇడుపు కాయితం’ టైటిల్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు. పూజా కార్యక్రమాలతో సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే కొందరు నెటిజన్లు ఈ టైటిల్‌ పై కావాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తారా? అని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీశాయి. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా హీరో తిరువీర్ స్పందించారు. ‘ఓ సుకుమారీ’ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ‘ఇడుపు కాయితం’ వివాదం పై తిరువీర్ మాట్లాడారు. ”ఒక ఇష్యూని ఎవరు ఏ ఉద్దేశ్యంతో చూస్తున్నారో తెలియట్లేదు. ‘ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలియనంత వరకు అందరూ ఇలాగే’ అనే ఒక నానుడి ఉంటుంది. అందుకే మన చూసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సమస్యను, సినిమాని, సోషల్ మీడియాని ఎవరు దేనికి వాడుకుంటున్నారో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని మీద రాయేసి మన బట్టలకు బురద అంటించుకోవడం ఎందుకు? అని నేను ఆలోచిస్తా” అని అన్నారు. ”’తెలంగాణాలో ఉర్దూ కలిసిన పదాలు ఎక్కువగా ఉంటాయి. హాస్పిటల్ ను ‘దవా ఖానా’ అంటారు. అది తెలుగు పదం కాదు.. ఉర్దూ పదం. ఇలాంటి పదాలే ఇక్కడ రోజూ జనజీవనంలో వాడుతుంటారు. మా నాన్న హాలిడేస్ ని ‘తాతీలు’ అనేవాడు. అసలు అది ఏ భాషో అర్థమయ్యేది కాదు. బుక్ లో ఉండే ‘పేజీ’లను ‘కమ్మలు’ అంటారు. అలాంటివి ఇప్పుడు కొంతవరకూ తగ్గాయి. పెద్దవారితో పాటుగా అంతరించి పోయాయి. ‘తాతీలు’ లాంటి ఒరిజినల్ పదాలు తెలంగాణాలో కనుమరుగైపోయాయి. కొన్ని పదాలు అందరికీ ఫెమిలియర్ అయ్యుండకపోవచ్చు” ”నేను ‘పరేషాన్’ సినిమా చేసేటప్పుడు ‘చెటాకు’ అంటే చాలామందికి తెలియలేదు. 100 గ్రాములను ‘చెటాకు’ అంటారు. ‘సౌ సారా.. చెటాక్ కారా.. పోదాం పారా’ అనే లిరిక్స్ మాకు అర్థం కాలేదు అన్నారు. అక్కడ ‘సౌ’ అంటే 100.. ‘కారా’ అంటే మిక్సర్. ‘మల్లేశం’, ‘పరేషాన్’ వంటి సినిమాల్లో ఇటువంటి పదాలు చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు ‘ఇడుపు కాయితం’పై వివాదం తలెత్తింది కానీ.. మేం ‘పరేషాన్ ‘ సినిమా అప్పుడే ఇలాంటివి చూసేసాం. అప్పట్లో ‘జార్జిరెడ్డి’ ‘పరేషాన్’ సినిమాల్లో చాలా పదాలు అర్థం కాలేదన్నారు” ”పరేషాన్’ సినిమాకి ఇలాంటివి మేం అనుభవించాం కాబట్టి, ఇప్పుడు నాకు నవ్వొస్తుంది. అప్పుడు ఇంత లైమ్ లైట్ లేదు కనుక ఎవరికి తెలియలేదు. ‘ఇడుపు కాయితం’ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్లయింది. ఒక ప్రాంతానికి సంబంధించిన మాండలికాన్ని, వారి జీవ భాషను గౌరవించాలి. రాయలసీమ, గోదావరి, ఉత్తరాంధ్ర, తెలంగాణ.. ఇలా ఏ ప్రాంతమైనా రెస్పెక్ట్ చేయాలి. మాది మహబూబ్ నగర్ లో షాద్ నగర్ వైపు.. మా అక్క వాళ్లది నాగర్ కర్నూల్ వైపు. మేం ‘డప్పు’ అంటే, వాళ్లు ‘తప్పెట’ అంటారు. ఒకే జిల్లాలో 100 కిలో మీటర్ల దూరంలో పదాలు మారిపోతున్నాయి. అలాంటప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే ఎందుకు మారవు?” ”నేను ‘తోలుకురా’ అంటే నన్ను చూసి ఎగతాళిగా నవ్వారు. తోలుకురాడానికి పశువు కాదు.. ‘తీసుకురా’ అనాలని చెప్పారు. నేను ‘పూలు తెంపు’ అంటే, ‘పూలు కోయి’ అనాలని చెప్పారు. అలా చెప్పడానికి బదులు, వారి మాడలికానికి రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుంది. దానిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని గిరిజన తెగలు ఎర్ర చీమలను వండుకొని తింటారు. అది వాళ్ల ఆహారపు అలవాటు. దాన్ని మనం కించపరచకూడదు. అది నేచర్ నుంచి వాళ్లకి లభిస్తున్న సోర్స్. దాన్ని మనం గౌరవించాలే తప్ప, అవమానించ కూడదు. అలా చేయడం తప్పు. సేమ్ భాష కూడా అంతే” ”తెలంగాణాలో ‘నష్కులా’ అంటే తెల్లారుజాము అని అర్థం. అది ఎవరికీ తెలియదు. బిత్తిరి సత్తెన్న వాడే పదాలు అర్థంకాక, తెలంగాణాలో ఉండే వేరే జిల్లాల వాళ్లే అర్థం ఏంటని నన్ను అడిగారు. నేను జొన్నరొట్టె తింటానంటే, తెలంగాణాలో ఉండేవాళ్లే అది ఎలా చేస్తారని అడిగారు. భాష, ఆహారపు అలవాట్లలో ఒక రాష్ట్రంలోనే ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు.. ప్రాంతం మారి దూరం పెరిగినప్పుడు డెఫినిట్ గా మారుతుంది. ‘ఇడుపు కాయితం’ అనేది అర్థం కాలేదే అనుకునేంత కోర్ తెలంగాణ పదం కాదు. హైదరాబాద్ లో మాట్లాడే తెలుగులాగా ఉండే పదం. కాబట్టి ఆ పేరుతో వచ్చిన ఇబ్బందేమీ లేదు” అని తిరువీర్ చెప్పుకొచ్చారు. Read Also: ‘సిగ్గుతో తల వంచుకోవాలి’.. ‘ఇడుపు కాయితం’ వివాదంపై నటుడు నరేష్ స్పందన ‘ఇడుపు కాయితం’ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ‘ఓ సుకుమారీ’ సినిమా శుక్రవారం థియేటర్లలో రిలీజయింది.

తెలంగాణ యాస, పదాలపై హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!

‘పరేషాన్’ అనుభవాలను గుర్తుచేసుకున్న తిరువీర్!

“ఇడుపు కాయితం” వివాదంపై తిరువీర్ స్పందన నిజంగానే ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.