|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ilaiyaraaja: డ్యూడ్ మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా.. సినిమాపై చట్టపరమైన చర్యలు

Published: 22-10-2025, 8:17 AM
Ilaiyaraaja: డ్యూడ్ మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా.. సినిమాపై చట్టపరమైన చర్యలు

ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్యూడ్’ సినిమా భారీ విజయం సాధించింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుంది. సంగీత దిగ్గజం ఇళయరాజా అనుమతి లేకుండా తన పాటలను వాడారంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు చట్టపరమైన చర్యలకు అనుమతినిచ్చింది.

Key Points

1

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' నాలుగు రోజుల్లో రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు.

2

సంగీత దిగ్గజం ఇళయరాజా 'డ్యూడ్' మేకర్స్ పై న్యాయపోరాటం.

4

ఇళయరాజా విన్నపాన్ని అంగీకరించిన కోర్టు, చట్టపరమైన చర్యలకు అనుమతి.

‘డ్యూడ్’ సినిమా భారీ విజయం

Ilaiyaraaja: తమిళ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సాదించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన (Ilaiyaraaja)ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

మేకర్స్ కి ఇళయరాజా షాక్

Mass Jathara : మాస్ జాత‌ర నుంచి ‘సూప‌ర్ డూప‌ర్’ సాంగ్ వ‌చ్చేసింది.. అద‌రిపోయిన ర‌వితేజ‌, శ్రీలీల స్టెప్పులు..

చట్టపరమైన చర్యలకు కోర్టు అనుమతి

ఇదిలా ఉంటే, డ్యూడ్ సినిమా మేకర్స్ కి సంగీత దిగ్గజం ఇళయరాజా షాకిచ్చారు. ఆయన అనుమతి లేకుండా సినిమాలో రెండు పాటలను వాడారు అంటూ ఆయన కోర్టుకెక్కారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతివ్వల్సిందిగా ఆయన కోర్టును కోరారు. ఇళయరాజా విన్నపాన్ని అంగీకరించిన కోర్టు చట్టపరమైన చర్యలకు అనుమతిని ఇచ్చింది. మరి ఈ విషయంపై ఇళయరాజా చట్ట పరంగా ఎలా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా తాను చేసిన పాటలను అనుమతి లేకుండా వాడారంటూ కోర్టుకెక్కాడు ఇళయరాజా.

ఇదిలా ఉండగా, గతంలోనూ ఇలాంటి కాపీరైట్ వివాదాల్లో ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ‘డ్యూడ్’ మేకర్స్ పై ఆయన ఎలా చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈ పరిణామం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.