|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఢాకాలో దౌత్య యుద్ధం: తప్పుడు ఇండియా మ్యాప్‌పై భారత అధికారిణి ప్రతాపం!

Published: 11-07-2026, 3:30 AM
  • ఢాకాలో తప్పుడు ఇండియా మ్యాప్‌ను ప్రదర్శించగా భారత దౌత్యవేత్త పూజా కుమారి అభ్యంతరం తెలిపారు.
  • జమ్మూకశ్మీర్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని ఆమె గట్టిగా చెప్పారు.
  • బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్ అహ్మద్ తారిఖ్ కరీం మ్యాప్‌ను ప్రదర్శించారు.
  • పూజా కుమారి తెగువను నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.

ఢాకాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత దౌత్యవేత్త పూజా కుమారి తెగువను ప్రదర్శించారు. భారతదేశానికి సంబంధించిన తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించగా, జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఆమె గట్టిగా చెప్పారు. ఆమె ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఢాకాలో భారత దౌత్యవేత్త తెగువ

ఢాకాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత దౌత్యవేత్త పూజా కుమారి (Puja Kumari) తెగువను ప్రదర్శించారు. సదస్సులో భారతదేశానికి సంబంధించిన తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించడంపై ఆమె వేదికపైనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ భారతదేశంలో విడదీయరాని, అంతర్భాగమని ఆమె ప్రపంచ దేశాల ప్రతినిధుల సమక్షంలో నిర్వాహకులను ఉతికారేశారు.

తప్పుడు ఇండియా మ్యాప్‌పై అభ్యంతరం

బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (BIISS) ఆధ్వర్యంలో ఢాకాలో సార్క్ పునరుద్ధరణ మార్గాలు(SAARC) అనే అంశంపై ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్యామా ఒబైద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, 2009 నుంచి 2014 వరకు భారత‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్‌గా పనిచేసిన అహ్మద్ తారిఖ్ కరీం ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇస్తూ ఓ మ్యాప్‌ను ప్రదర్శించారు. అందులో జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. దీంతో భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా వెంటనే రియాక్ట్ అయ్యారు. అహ్మద్ తారిఖ్ కరీం ప్రసంగిస్తుండగానే ఆమె మధ్యలో లేచి ‘మీరు ప్రదర్శించిన భారతదేశ పటం తప్పుగా ఉంది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగం’అని స్పష్టం చేశారు. అందుకు అహ్మద్ తారిఖ్ కరీం సర్దిచెబుతూ.. ‘ఈ మ్యాప్ కేవలం ప్రాతినిధ్య ప్రయోజనాల కోసమే ఉపయోగించామని, వాస్తవ సరిహద్దులను ఇది సూచించదని’ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం

అయినా.. పూజ కుమారి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘సార్, మీ వివరణ నాకు అర్థమైంది.. కానీ జమ్మూకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇక్కడ అది తప్పుగా చూపించబడింది. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడానికే నేను అభ్యంతరం తెలిపాను’ అని గట్టిగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం అందుకు సంబధించిన వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతర్జాతీయ వేదికపై జమ్మూకశ్మీర్ విషయంలో పూజా కుమారి గట్టి వైఖరి భారత్ సార్వభౌమత్వాన్ని చాటింది. ఆమె దౌత్య తెగువ దేశ ప్రతిష్టను పెంచింది, ఇది విస్తృత ప్రశంసలు అందుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.