|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆయన లేకుంటే ఇంద్రజ అనే పేరు లేదు.. హీరోయిన్‌గా కెరీర్ లేదు.. నటి ఇంద్రజ కామెంట్స్

Published: 04-06-2025, 2:44 AM

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న సీనియర్ నటీమణులు ఇంద్రజ, ఆమని, రోజా, లయ తమ అనుభవాలను పంచుకున్నారు. ఇంద్రజ, ఎస్వీ కృష్ణారెడ్డి గారికి తన కెరీర్ లోని ప్రధాన పాత్రను కృతజ్ఞతగా గుర్తుచేసుకుంది.

Key Points

1

ఇంద్రజ తన సినీ జీవితంలో ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్రను వివరించారు.

2

ఆమని, రోజా, లయ వంటి ఇతర నటీమణులు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు.

4

శుభలగ్నం సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయిందని నటీమణులు పేర్కొన్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

ఫ్యామిలీ మొత్తం కలిసి ఆనందంగా చూసే వంటి చిత్రాలు తెరకెక్కించిన టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. వినోదం, మాయలోడు, కొబ్బరి బొండాం, శుభలగ్నం, ఎగిరే పావురమా, యమలీల వంటి ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతోమంది హీరోయిన్స్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే, మరికొంతమంది కెరీర్‌కు ఉపయోగపడ్డారు.

అలాంటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుటినరోజు వేడుకలు జూన్ 1న హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో హీరోలు, నటులతోపాటు సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఆర్కే రోజా, రవళి, లయ , ఆమని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సీనియర్ హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నటి లయ మాట్లాడుతూ.. “ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్లీ అవకాశం ఉంటే ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది” అని అన్నారు.

నటీమణుల కామెంట్స్

“ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నాకు జన్మనిచ్చింది ఈవీవీ గారు అయితే పెంచింది ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయన దర్శకత్వంలో నేను నటించిన శుభలగ్నం మూవీ గురించి ఇప్పటికీ ప్రేక్షకులు అడుగుతుంటారు. ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా” అని సీనియర్ హీరోయిన్, నటి ఆమని తెలిపారు.

సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ మాట్లాడుతూ.. “నేను ఏ వేదిక మీద మాట్లాడినా ముందు ఎస్వీ కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పే మాట్లాడుతా. ఆయన లేకుంటే నాకు ఇంద్రజ అనే పేరు లేదు, హీరోయిన్‌గా కెరీర్ లేదు. దేవుడు నా కోసం పంపిన ఏంజెల్ కృష్ణా రెడ్డి గారు అనుకుంటాను” అని చెప్పుకొచ్చారు.

“ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో చేసిన శుభలగ్నం మూవీ నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భర్తను కోటి రూపాయలకు అమ్మే అలాంటి ఘటనలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. అంటే, ఎంత ఫార్వార్డ్‌గా కృష్ణారెడ్డి గారి క్రియేటివిటీ ఉందో ఊహించుకోవచ్చు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని ఆర్కే రోజా వెల్లడించారు.

శుభలగ్నం సినిమా ప్రాముఖ్యత

ఇదే కార్యక్రమంలో నిర్మాత, ఎస్వీ కృష్ణారెడ్డి స్నేహితుడు అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. “దర్శకుడు కేవీ రెడ్డి గారిని ఎస్వీ కృష్ణారెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నాడు. దర్శకరత్న దాసరి గారికి ఏకలవ్య శిష్యుడిని అని ఎస్వీ చెప్పుకునేవారు” అని అన్నారు.

“ఎస్వీ కృష్ణారెడ్డిని నువ్వు డైరెక్టర్ అవుతావు అని ఎంకరేజ్ చేశా. మా కాంబినేషన్‌లో గొప్ప చిత్రాలు రూపొందించాడు. మా మూవీస్‌లో చేసిన కుటుంబమంతా దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుండటం గర్వంగా ఉంది. వాళ్లంతా మా ఎస్వీ బర్త్ డే వేడుకలకు రావడం సంతోషాన్నిస్తోంది” అని ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి తెలిపారు.

ఎస్వీ కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. నటీమణులు వారి కెరీర్‌లో ఆయన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.