
వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కొన్ని శుభ చిహ్నాలను ఉంచడం వల్ల సంతోషం, సంపద పెరుగుతాయి. ఈ కథనంలో ఇంటికి శుభాన్ని ప్రసాదించే ఐదు శుభ చిహ్నాల గురించి తెలుసుకుందాం.
Key Points
వైష్ణవి తిలకం, స్వస్తిక్, ఓంకారం వంటి శుభ చిహ్నాలను ఇంటి ప్రవేశద్వారం వద్ద ఉంచండి.
శంఖ చిహ్నం ఇంటిలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
ఇంటిలో 'శుభ్ లాభ్' అని రాసుకోవడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
ఈ చిహ్నాలను ఉంచడం వల్ల సంతోషం, సంపద పెరుగుతాయి.
వాస్తు ప్రకారం శుభ చిహ్నాల ప్రాముఖ్యత
ప్రతీ ఒక్కరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని పొరపాట్లు వలన ఇబ్బందులు వస్తాయి. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోతాయి. వాస్తు ప్రకారం అనుసరించకపోవడం వలన వివిధ రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇంటి ముఖద్వారం దగ్గర కొన్ని శక్తులు ఉంటాయి. కనుక ఇంటి ముఖద్వారం దగ్గర వాస్తు నియమాలని పాటించడం మంచిది. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి దిశలో కూడా వాస్తుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి.
ఇంటి నాలుగు వైపులా కూడా అందంగా కనపడే విధంగా ఉంచుకోవాలి. ఈరోజు ఇంటి ముఖద్వారానికి సంబంధించి కొన్ని వాస్తు నియమాలను తెలుసుకుందాం. వీటిని ఆచరించినట్లయితే ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది. ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతోషంగా ఉండొచ్చు.
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఏ చిహ్నాలు ఉంచాలి?
వైష్ణవ తిలకానికి ఎంతో ప్రత్యేకత ఉంది. విష్ణువు అవతారాలైన కృష్ణుడు, రాముని ఆరాధనలో ఈ తిలకాన్ని సమర్పిస్తారు. ఈ తిలకాన్ని ఏ మూలలో ఉంచితే ఆ ఇంట్లో అనందం ఉంటుంది. వైష్ణవి తిలకం చందనంతో తయారుచేస్తే శుభ ఫలితాలు వెంటనే ఉంటాయి.
హిందూమతంలో స్వస్తిక్ చిహ్నం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇంటి ముఖద్వారం లేదా ఏదైనా దిక్కులో స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. సానుకూల శక్తి ఇంట్లో ఏర్పడుతుంది. శ్రేయస్సు సంపదకు లోటు ఉండదు.
ఓంకారం చాలా ప్రసిద్ధమైనది. ప్రతి శుభకార్యం ఓంకారంతో మొదలుపెడతారు. ఓం చిహ్నం ఉన్నట్లయితే శాంతి, ఆనందం ఉంటాయి. కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు రావు.
శుభ చిహ్నాల వల్ల కలిగే ప్రయోజనాలు
హిందూమతంలో శంఖాన్ని పవిత్రంగా భావిస్తారు. విష్ణువు, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంట్లో ఎక్కడైనా ఒక మూలలో శంఖం చిహ్నం ఉండేటట్టు చూసుకోండి. ఆ ఇంట్లో శ్రీహరి కొలువై ఉంటాడు. వాస్తు దోషాలు తొలగిపోతాయి. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.
ఇంట్లో ఎక్కడైనా శుభ్ లాభ్ అని రాస్తే కూడా మంచి జరుగుతుంది. ఈ రెండిటిని మనం ఇంట్లో ఏదైనా ఒక చోట రాసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. సమస్యలన్నీ తీరుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇంటిలో శుభ చిహ్నాలను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే, ఇవి కేవలం సూచనలు మాత్రమే. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


