|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుబాయ్‌లో పెను ప్రమాదం! ఇరాన్ క్షిపణి దాడితో దద్దరిల్లిన విమానాశ్రయం!

Published: 16-03-2026, 4:05 PM
  • దుబాయ్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి
  • విమానాశ్రయం దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది
  • దుబాయ్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపివేశారు
  • డ్రోన్ దాడిలో ప్రాణ నష్టం లేదని సమాచారం

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విమానాల రాకపోకలను నిలిపివేశారు.

దుబాయ్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి

మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉద్రిక్త‌ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ మరో దారుణానికి పాల్పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భయంకరమైన డ్రోన్ దాడికి ఇరాన్ పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ డ్రోన్ కారణంగా విమానాశ్రయానికి సమీపంలోనే భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతున్నాయి.

విమానాశ్రయంలో నిలిచిన విమాన రాకపోకలు

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఇంధన ట్యాంక్ పై డ్రోన్ పడినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ ప్రమాద సంఘటన నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక విమానాలను అల్ మక్తుమ్ విమానాశ్రయానికి మళ్ళించారు. అయితే ఈ డ్రోన్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది.

భారీ అగ్ని ప్రమాదం, ఆస్తి నష్టం

A post shared by The Washington Post (@washingtonpost)

ఇరాన్ చర్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచే విధంగా ఉన్నాయి. ఈ దాడి ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితిని అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.