|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సౌదీ, ఖతర్‌లపై ఇరాన్ ప్రతీకారం! ఒక్కసారిగా పేలుళ్లతో దద్దరిల్లిన రాజధానులు!

Published: 18-03-2026, 5:35 PM
సౌదీ, ఖతర్‌లపై ఇరాన్ ప్రతీకారం! ఒక్కసారిగా పేలుళ్లతో దద్దరిల్లిన రాజధానులు!
  • ఇరాన్ ఖతర్, సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది.
  • సౌదీ రాజధాని రియాద్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి; నాలుగు మిస్సైల్స్‌ను అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటన.
  • ఖతర్‌లోని రస్ లఫాన్ రిఫైనరీ వద్ద క్షిపణి దాడి కారణంగా మంటలు చెలరేగాయి.
  • ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానాలు ధ్వంసం అయినట్లు సమాచారం.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఇరాన్ ఖతర్ మరియు సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా సౌదీ రాజధాని రియాద్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.

ఖతర్, సౌదీలపై ఇరాన్ క్షిపణి దాడులు

ఇరాన్ ( Iran) వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు 18 రోజులుగా ఏ దేశం కూడా తగ్గకుండా యుద్ధంలో ముందుకు వెళ్తున్నాయి. వేలాది మంది చనిపోతున్నా, కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది బడా లీడర్లు, అధికారులను కోల్పోయినప్పటికీ కూడా యుద్ధం కొనసాగిస్తోంది ఇరాన్. ఇక లేటెస్ట్ గా ముందుగా వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది.

రియాద్‌లో భారీ పేలుళ్లు, మిస్సైల్స్ అడ్డుకున్న సౌదీ

ఖతర్ ( Qatar), సౌదీ అరేబియాపై ( Saudi) బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ముఖ్యంగా సౌదీ రాజధాని రియాద్ లో భారీ పేలుళ్లకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు మిస్సైల్స్‌ ను అడ్డుకున్నామని సౌదీ సివిల్ డిఫెన్స్ ప్రకటన చేసింది. మరోవైపు క్షిప‌ణి దెబ్బకు ఖ‌త‌ర్‌ లోని రస్ లఫాన్ రిఫైనరీ వద్ద మంటలు కూడా చెలరేగాయి. మిస్సైల్స్‌ శకలాలు పడడంతో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానాలు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఖతర్ రిఫైనరీలో మంటలు, ఇజ్రాయెల్‌లో విమానాల ధ్వంసం

A post shared by Al Arabiya English (@alarabiya_eng)

ఇరాన్ ప్రతీకార దాడులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.