
📌 Key Points
- ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
- టెల్ అవీవ్ నగరంలో వేలాది కాకుల గుంపు కలకలం రేపింది.
- వలసల సమయంలో ప్రతి సంవత్సరం 50 కోట్ల పక్షులు ఇజ్రాయెల్ గుండా ప్రయాణిస్తాయి.
- కాకుల గుంపులు ఇజ్రాయెల్ వినాశనానికి సూచన అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో వేలాది కాకులు గుమిగూడాయి. ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టెల్ అవీవ్‌లో వేలాది కాకులు: కారణం?
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య మొన్నటి వరకు యుద్ధం జరగగా, కోట్లాది నష్టం జరిగింది. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో కాస్త వెనకకు తగ్గిన ట్రంప్, తాత్కాలిక విరామం ప్రకటించారు. అటు ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. ఐదు కండీషన్లకు ఒప్పుకుంటేనే, తాము యుద్ధం ఆపేస్తామని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో వేలాది కాకులు కలకలం రేపాయి. యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు వేలాది సంఖ్యలో కాకులు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా షేక్ చేస్తోంది. ఆకాశంలో ఎటు చూసినా ఈ కాకులే కనిపిస్తున్నాయి.
వినాశనానికి సంకేతమా? ప్రజల్లో ఆందోళన!
అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ వినాశనానికి సంకేతం అని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదేం వినాశనం కాదని, ఇలాంటి సంఘటనలు సాధారణంగా జరుగుతూ ఉంటాయని మరికొంతమంది స్పష్టం చేస్తున్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వలసల సమయంలో 50 కోట్ల పక్షులు ఇజ్రాయెల్ గుండా కాకులు, ఇతర పక్షులు ప్రయాణిస్తాయని అటు శాస్త్రవేత్తలు కూడా పేర్కొంటున్నారు. గూడు కట్టే కాలంలో హుడెడ్ కాకులు పట్టణాలలో గుంపులుగా చేరుతాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ కాకుల విహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
వలస పక్షుల రాక: శాస్త్రవేత్తల వివరణ
A post shared by WorldInLast24Hrs (@worldinlast24hrs)
మొత్తానికి టెల్ అవీవ్‌లో కాకుల గుంపు కలకలం రేపింది. ఇది వినాశన సూచన అని కొందరు భయపడుతుంటే, వలసల కారణంగానే ఇలా జరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.



Posani Krishna Murali Quits Politics for Filmmaking: Will Release One Film Annually