|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అందరూ ఆస్వాదించేలా ఉండబోతుంది: ఆధిక్ రవిచంద్రన్

Published: 05-10-2025, 7:43 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ AK64 చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం అభిమానులకే కాకుండా కుటుంబ సభ్యులు అందరూ ఆస్వాదించేలా యాక్షన్, వినోదాలతో నిండి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Key Points

1

అజిత్ కుమార్ 64వ చిత్రంగా 'AK64' తెరకెక్కుతోంది.

2

దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్, అజిత్ కాంబోలో ఇది రెండో ప్రాజెక్ట్.

4

వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం.

AK64 పై ఆధిక్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) వరుస సినిమాలు చేసినప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు. అయినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆయన కెరీర్‌లో 64వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనుంది. దీనిని తమిళ బడా నిర్మాణ సంస్థ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఆధిక్, అజిత్ కాంబోలో కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావండంతో ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది. షూటింగ్ నవంబర్ స్టార్ చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు టాక్. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆధిక్ రవిచంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని ముఖ్యంగా అభిమానుల కోసం చేశాను. కానీ ‘AK64’ అందరూ ఆనందించే చిత్రం అవుతుంది. యాక్షన్, భావోద్వేగం, వినోదం అన్ని ఎమోషన్స్ ఉండి కుటుంబాలతో పాటు అభిమానులు ఆస్వాదించేలా ఉండబోతుంది’’ అని చెప్పుకొచ్చారు.

అజిత్-ఆధిక్ కాంబో.. పెరుగుతున్న హైప్

అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం AK64

మొత్తంగా, అజిత్-ఆధిక్ రవిచంద్రన్ కాంబోలో వస్తున్న AK64 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోందని దర్శకుడు చెప్పిన మాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.