
త్రినాథ్ కఠారి హీరోగా నటించిన ‘ఇట్లు మీ ఎదవ’ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన లాంచ్ చేశారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.
Key Points
త్రినాథ్ కఠారి హీరోగా, దర్శకత్వం కూడా ఆయనే.
బుచ్చిబాబు సాన 'ఇట్లు మీ ఎదవ' టైటిల్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది.
తాగుబోతు రమేష్, తనికెళ్ళ భరణి తదితరులు నటిస్తున్నారు.
‘ఇట్లు మీ ఎదవ’ సినిమా విశేషాలు
తెలుగులో వస్తున్న న్యూ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇట్లు మీ ఎదవ. త్రినాథ్ కఠారి హీరోగా నటించిన ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ ఇట్లు మీ ఎదవ సినిమాను నిర్మిస్తున్నారు.
మన తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ ఇట్లు మీ ఎదవ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే, ‘ఇట్లు మీ ఎదవ’అనే ఆసక్తికరమైన టైటిల్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. దీనికి వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో బుచ్చిబాబు సాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “ఇట్లు మీ ఎదవ గ్లింప్స్ చూశాను, చాలా బావుంది. చాలా ఫన్నీగా ఉంది” అని అన్నారు.
బుచ్చిబాబు సాన ప్రశంసలు
“ప్రతి అబ్బాయికి ఈ టైటిల్ చిన్నప్పటి నుంచి కెరీర్‌లో సెటిల్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. అలాంటి టైటిల్ పెట్టారు” అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సాన నవ్వుకున్నారు. అనంతరం “ఇది మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. చూడటానికి చాలా బావుంది. ‘ఇట్లు మీ ఎదవ’ టీం అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావలని కోరుకుంటున్నాను” అని కోరారు దర్శకుడు బుచ్చిబాబు సాన.
ఇదిలా ఉంటే, ఇట్లు మీ ఎదవ చిత్రంలో తనికెళ్ల భరణి , గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించడం విశేషం.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
ఇటీవల నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించిన జగదీష్ చీకటి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి ఉద్ధవ్ ఎస్‌బీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఇట్లు మీ ఎదవ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, దర్శకుడు బుచ్చి బాబు సాన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ చేస్తోంది.
చివరగా, ‘ఇట్లు మీ ఎదవ’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు సాన ప్రశంసలతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.


