|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జబర్దస్త్ లో ఊహించని ట్విస్ట్: నాగబాబు ఎంట్రీతో హైపర్ ఆది మాస్ కమ్ బ్యాక్! జూన్ నుండి రచ్చ షురూ!

Published: 19-05-2026, 5:45 AM
జబర్దస్త్ లో ఊహించని ట్విస్ట్: నాగబాబు ఎంట్రీతో హైపర్ ఆది మాస్ కమ్ బ్యాక్! జూన్ నుండి రచ్చ షురూ!
  • జబర్దస్త్ షోకి నాగబాబు జడ్జిగా గ్రాండ్ రీఎంట్రీతో పెరిగిన హైప్.
  • స్టార్ కమెడియన్ హైపర్ ఆది జూన్ నుండి షోలోకి తిరిగి రానున్నట్లు ప్రకటన.
  • పాత టీమ్ కాంబినేషన్ తోనే ఆది రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడి.
  • రేటింగ్స్ పడిపోయిన జబర్దస్త్ షోకు పూర్వ వైభవం రావడం ఖాయం!

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన జబర్దస్త్ షో మళ్ళీ వార్తల్లో నిలిచింది! నాగబాబు గ్రాండ్ రీఎంట్రీతో ఊపందుకున్న ఈ కామెడీ షోకి, ఇప్పుడు హైపర్ ఆది కూడా తిరిగి రాబోతున్నాడనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ మాస్ కమ్ బ్యాక్ వివరాలు తెలుసుకుందాం!

జబర్దస్త్ రీఎంట్రీ: హైపర్ ఆది సంచలన ప్రకటన!

తెలుగు బుల్లితెరపై సంచలన కామెడీ జబర్దస్త్. ఈ షోకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మారుమూలన ఉన్న టాలెంట్ ను వెలుగులోకి తెచ్చింది జబర్దస్త్. టాలీవుడ్ లో కమెడియన్స్ కు తగ్గుతున్న టైమ్ లో.. జబర్దస్త్ కమెడియన్స్ ఆ ప్లేస్ ను భర్తి చేశారు. ఎంతో మంది కమెడియన్స్ ను పరిశ్రమకు అందించింది జబర్దస్త్. తెలుగు రాష్ట్రాలలో లక్షలమంది మనసు దోచుకుంది ఈ కామెడీ షో. ఎంత పాపులారిటీ సాధించిందో.. అన్ని విమర్శలు కూడా జబర్దస్త్ పై వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్, రైటర్స్, యాక్టర్స్, ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా పరిచయం అయ్యి స్టార్ డమ్ తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ స్టార్ కమెడియన్ హైపర్ ఆది. కెరీర్ బిగినింగ్ లో అదిరే అభి టీమ్‌లో చిన్న ఆర్టిస్ట్‌గా కనిపించి, తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ లో ఎంతలా ఎదిగాడంటే.. హైపర్ ఆది లేకుంటే షో చూడటమే ఆపేసిన ఆడియన్స్ కూడా ఉన్నారు.

నాగబాబు వచ్చేశారు.. ఇక ఆది రచ్చే!

ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు పెరగడం, అలాగే జబర్దస్త్‌లో కొత్త టీమ్స్‌కు అవకాశాలు ఇవ్వడం వంటి కారణాలతో హైపర్ ఆది షోకు దూరమయ్యాడు. నాగబాబు, రోజా కూడా జబర్దస్త్ ను వదిలేయడంతో.. హైపర్ ఆది లాంటి స్టార్ కమెడియన్స్ కూడా ఈ షోకి దూరం అయ్యాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు ‘ఢీ’ , ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి టెలివిజన్ షోలలో కనిపిస్తూ బిజీగా ఉన్నాడు.

స్టార్స్ అంతా వెళ్లిపోవడంతో.. చాలా కాలం జబర్దస్త్‌ కళతప్పినట్టు అయ్యింది. ఈ కామెడీషోకి రేటింగ్ కూడా పడిపోయింది. ఈక్రమంలో జబర్దస్త్ నిర్వాహకులు మళ్లీ షోకి పూర్వ వైభవం తీసుకువచ్చే పనుల్లో ఉన్నారు. ఇందులో భాగంగా.. పాత సభ్యుల రీఎంట్రీలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా నాగబాబు మళ్లీ జడ్జిగా రావడంతో షోపై మళ్లీ హైప్ పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

జూన్ నుండి జబర్దస్త్ లో మారనున్న సీన్!

ప్రోమోలో గెస్ట్‌గా వచ్చిన హైపర్ ఆదిని నాగబాబు “మళ్లీ జబర్దస్త్‌కి ఎప్పుడు వస్తావు?” అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆది, “ఎవరైతే మిస్ అయ్యారో వాళ్లతో కాంబినేషన్ సెట్ చేసుకొని జూన్ నుంచి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో హైపర్ ఆది త్వరలోనే జబర్దస్త్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రైజింగ్ రాజు, అజార్, దొరబాబు వంటి తన పాత టీమ్ సభ్యులతో మళ్లీ కలిసి స్కిట్స్ చేయనున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది.

హైపర్ ఆది తిరిగి జబర్దస్త్‌లోకి వస్తే షోకు మరింత క్రేజ్ రావడంతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతే కాదు హైపర్ ఆదికి ఉన్న డిమాండ్ ను బట్టి.. ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. స్కిట్ కు 5 లక్షలు తీసుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మరి చూడాలి హైపర్ ఆది ఎప్పటి నుంచి వస్తాడు. ఏం చేయబోతున్నాడు అనేది.

హైపర్ ఆది రీఎంట్రీతో జబర్దస్త్ షోకి మునుపటి వైభవం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. జూన్ నుండి తెరపై కనిపించనున్న ఈ సరికొత్త రచ్చ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవుతూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.