
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రజాదరణ పొందిన తన్మయి తన జీవితంలోని కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను, మోసాలను బయటపెట్టింది. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించినట్లు వెల్లడించింది.
Key Points
జబర్దస్త్ తన్మయి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.
ఆర్థిక ఇబ్బందులు, మోసపూరిత స్నేహితులు, కుటుంబ సభ్యుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి.
శస్త్రచికిత్స తర్వాత సహాయం లేకపోవడం, కుటుంబ బాధ్యతల భారం.
ఇండస్ట్రీలోని వ్యక్తుల వల్ల అనుభవించిన దోపిడీ, వేధింపులు.
ఆర్థిక ఇబ్బందులు మరియు మోసం
Jabardasth Tanmay : జబర్దస్త్ తో పాపులారిటీ తెచ్చుకున్న తన్మయి మధ్యలో కొన్నాళ్ళు ఎవరికీ కనపడకుండా ఇండస్ట్రీకి దూరమయింది. ఇటీవలే మళ్ళీ కొన్నాళ్ల నుంచి జబర్దస్త్, పలు టీవీ షోలు చేస్తూ అలరిస్తుంది. చాన్నాళ్ల తర్వాత తన్మయి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ కష్టాలు చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో తన్మయి మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ మోసం చేశారు, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఇండస్ట్రీ కూడా మోసం చేశారు. అందరికి నా మనీ, నా బాడీ కావలి అంతే. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు, నా వెనక తిరిగిన వాళ్ళు ఎవరూ ఒక్క రోజు కూడా ఫుడ్ పెట్టరు. నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోడానికి నాకు ఎవరూ లేరు.
ఒంటరితనం మరియు కుటుంబ బాధ్యతలు
నా నడుముకు రీసెంట్ గా సర్జరి జరిగినప్పుడు కూడా నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి రమ్య గారు అని వచ్చి ఒక రోజంతా చూసుకొని సర్జరీ అయ్యాక ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు. నన్ను చూసుకోడానికి ఎవరూ లేరు. నేనే ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను. వాళ్ళు హైదరాబాద్ రారు. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. అమ్మ ఒక్కదే. నాన్న చనిపోయారు. అమ్మమ్మ, నాన్నమ్మ ముసలివాళ్ళు నేనే సపోర్ట్ చేయాలి. మా అన్న ఊళ్ళో తాపీ పని చేస్తూ బతుకుతాడు. వాళ్ళ పిల్లలకు నేనే మంచి చదువు చెప్పించాలి అంటూ ఏడ్చేసింది తన్మయి.
ఇండస్ట్రీలోని అనుభవాలు మరియు వేధింపులు
అలాగే.. మా నాన్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు డబ్బుల కోసం ఒకరి దగ్గర ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఇండస్ట్రీ వదిలేయ్ మా దగ్గరే ఉండు అన్నారు. ఆ ఆవిషయంలో నేనే తప్పు చేశాను. కానీ ఆ తర్వాత వాళ్ళు కొట్టడం, తిట్టడం, ఫోన్ చేసి హెరాజ్ చేయడం చేశారు. బయటకు తెలిస్తే మా అమ్మవాళ్ళు బాధపడతారు. వాళ్ళ వల్ల నేను చాలా బాధపడ్డాను, ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తా అన్నారు. ఆ భయంతోనే ఓ రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను అంటూ ఎమోషనల్ అయింది.
తన్మయి జీవితంలోని కష్టాలు, ఆమె అనుభవించిన మోసం, ఒంటరితనం చాలా విషాదకరమైనవి. ఆమె బాధలను అర్థం చేసుకోవడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.


