
📌 Key Points
- సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి జాక్వెలిన్‌కు ప్రేమలేఖ రాశాడు.
- వాలెంటైన్స్ డే సందర్భంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని లేఖలో పేర్కొన్నాడు.
- గతంలో కూడా జాక్వెలిన్‌కు ఖరీదైన బహుమతులు ఇచ్చాడని మనీలాండరింగ్ కేసులో తేలింది.
- సుకేష్ తనను వేధిస్తున్నాడని జాక్వెలిన్ జైలు అధికారులకు ఫిర్యాదు చేసింది.
సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచే జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై తన ప్రేమను చాటుకుంటున్నాడు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమెకు హెలికాప్టర్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సుకేశ్ ప్రేమలేఖలో ఏముంది?
Jacqueline Fernandez: ప్రేమ అన్న మాటకు అర్థం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కానీ, సుకేశ్ చంద్రశేఖర్ స్టైల్ మాత్రం చాలా కాస్ట్లీ! జైలు గోడల మధ్య ఉన్నా కూడా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మీద తన ‘ప్రేమ’ను చాటుకుంటూనే ఉన్నాడు. 2026 వాలెంటైన్స్ డే సందర్భంగా అతను రాసిన ఒక లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సామాన్యులు రోజా పువ్వులు ఇస్తే, ఈయన గారు ఏకంగా ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్‌నే గిఫ్ట్‌గా ఇస్తానంటున్నాడు. వివరాలలోకి వెళితే ..
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్, జాక్వెలిన్‌ను “మై బేబీ బొమ్మ” అని సంబోధిస్తూ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ఈ ప్రేమికుల రోజున ఆమె కోసం ‘ఎయిర్‌బస్ H-సిరీస్ హెలికాప్టర్’ను బహుమతిగా ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. విచిత్రం ఏంటంటే, ఆ హెలికాప్టర్ మీద ఆమె పేరులోని మొదటి అక్షరాలు (JF) కూడా ఉండబోతున్నాయట. తన వల్ల ఆమె ఎదుర్కొన్న చట్టపరమైన ఇబ్బందులకు క్షమాపణలు కోరుతూ, తామిద్దరం ఆధునిక కాలపు “రోమియో-జూలియట్లు” అని అతను తనను తాను ఊహించుకుంటూ లేఖ రాసాడు.ఇక ఇప్పుడు జైలులో ఉండి కూడా ఇన్ని వందల కోట్ల బహుమతుల గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జాక్వెలిన్‌కు సుకేష్ ఇచ్చిన గిఫ్ట్‌లు
సుకేశ్ ఇలాంటి భారీ బహుమతులు ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమెకు బేవర్లీ హిల్స్‌లో బంగ్లా, ప్రైవేట్ జెట్, ఖరీదైన బ్యాగులు, వజ్రాల నగలు ఇచ్చాడని 200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే జాక్వెలిన్ మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్‌గా ఉంది. ఇక జాక్వెలిన్ అతను తనను మానసికంగా వేధిస్తున్నాడని, జైలు అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. సుకేశ్ రాసే ఈ ప్రేమలేఖలు ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయనే చెప్పాలి.
సుకేష్‌పై జాక్వెలిన్ ఫిర్యాదు
సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి వరుసగా ప్రేమలేఖలు రాస్తూ, వందల కోట్ల బహుమతులు ప్రకటిస్తున్నా, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వైఖరి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అతనితో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేదని, అతను చెబుతున్న ఈ భారీ బహుమతుల గురించి తనకు అసలు సమాచారమే లేదని ఆమె ఇప్పటికే పలుమార్లు కోర్టుకు విన్నవించుకుంది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ మరియు భారీ మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్, తన పేరును వాడుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారల పేర్లు బయటకు వచ్చినప్పటికీ, సుకేశ్ పంపిస్తున్న ఈ ‘ప్రేమ లేఖలు’ జాక్వెలిన్‌ను చట్టపరంగా మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అందుకే ఆమె ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ, కేవలం చట్టంపైనే తన నమ్మకాన్ని ఉంచుతోంది.
సుకేష్ వరుసగా ప్రేమలేఖలు రాస్తూ బహుమతులు ప్రకటిస్తున్నా, జాక్వెలిన్ మాత్రం అతనితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతుందా అనేది చూడాలి.


