|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జాక్వెలిన్ ‘జుగ్ని’ వీడియోలో 3 సెకన్ల సీన్ వివాదం: నెటిజన్ల ఆగ్రహం

Published: 17-07-2026, 10:15 AM

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజా మ్యూజిక్ వీడియో ‘జుగ్ని’ 48 గంటల్లో 1.4 కోట్ల వ్యూస్ సాధించి వైరల్ అయింది. అయితే, ఒక 3 సెకన్ల సీన్ లో జాక్వెలిన్ ఎక్స్పోజ్ అయినట్లు నెటిజన్లు ఆరోపించడంతో వివాదం చెలరేగింది.

Key Points

1

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 'జుగ్ని' మ్యూజిక్ వీడియో 48 గంటల్లో 1.4 కోట్ల వ్యూస్ సాధించింది.

2

పాటలో 3 సెకన్ల సీన్ లో జాక్వెలిన్ ఎక్స్పోజ్ అయినట్లు నెటిజన్ల ఆరోపణ.

4

బి ప్రాక్ వంటి దేశభక్తి పాటల గాయకుడు ఇలాంటి పాట పాడటంపై నెటిజన్ల నిరాశ.

జుగ్ని పాట 48 గంటల్లో 1.4 కోట్ల వ్యూస్

Jugni Controversy: ఇదసలే  సోషల్ మీడియా జమానా ..చిన్న నిప్పు రవ్వ చాలు మొత్తం తగలెట్టడానికి .ఈ టాపిక్ ఎందుకంటారా..జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజాగా “జుగ్ని” అంటూ ఒక మ్యూజిక్ వీడియో వదిలింది.ఇక బి ప్రాక్, సోను తుక్రాల్ పాడిన ఈ పాట రిలీజ్ అయిన రెండు రోజులలోనే (48 గంటల్లోనే)ఏకంగా 1.4 కోట్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ ని షేక్ చేసింది కూడా.అంత వరకు భాగానే ఉంది.కానీ ఆ పాటే ఇపుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంది.

అసలు ఎడిటర్ సాంగ్ ఎడిట్ చేస్తూ నిద్ర పోయాడా

ఈ పాటలో బోల్డ్ అవుట్‌ఫిట్ వేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక షాట్ లో ఎక్స్పోజింగ్ చేసిందన్నది నెటిజన్ల వాదన. ఎక్స్పోజింగ్ అంతా చేస్తున్నారు దాంట్లో ఏముందనేనా …ఇందులో ఆ బార్డర్స్ మరింత శ్రుతి మించింది మరి.అసలు ఎడిటర్ సాంగ్ ఎడిట్ చేస్తూ నిద్ర పోయాడా అంటూ సోషల్ మీడియా జనాలు ఎకిపారేస్తుండటం,అలా ఆ వివాదం కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి మేకర్స్ చెవిన పడటంతో వెంటనే రియాక్ట్ అయి ఆ సీన్ ని బ్లర్ చేసేసింది.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.అసలేమాత్రం లేట్ చేయకుండా ఆ క్లిప్పింగ్స్‌ను స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేసేశారు నెటిజన్లు.

3 సెకన్ల సీన్ ఎందుకు వివాదాస్పదమైంది?

బట్టలు తక్కువైపోతున్నాయంటూ జరిగిన గొడవలెన్నో

గతంలో కూడా పాటల్లో బట్టలు తక్కువైపోతున్నాయంటూ జరిగిన గొడవలెన్నో. ఆ మధ్య వచ్చిన”పఠాన్” సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా పదుకొణె ధరించిన కాస్ట్యూమ్స్ రంగులపై, డిజైన్‌పై దేశవ్యాప్తంగా పెద్ద రచ్చే జరిగింది.ఇక తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్”జుగ్ని”విషయం లోనూ ఇదే రిపీట్ అయింది.అయితే ఈసారి అంతకు మించి ఇది పాట కాదు ఇదో పోర్న్ కంటెంట్ అంటూ కానీ దానికి ఎంటర్ టైన్ మెంట్ అంటూ కలరింగ్ ఇస్తున్నారంటూ చెడుగుడు ఆడేస్తున్నారంతా.

ఈ “జుగ్ని”ఎప్పుడు చల్లారుతుందో !

నెటిజన్ల స్పందన, మేకర్స్ రియాక్షన్

ఐతే ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తప్పేమీ లేదని డైరెక్టర్ ఏది చెబితే అదే ఫాలో అవుతుందని మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.ఇక ఈ పాట పాడిన బి ప్రాక్ గతంలో ‘తేరి మిట్టి’ అంటూ మంచి మంచి దేశభక్తి టలు పాడాడని, అలాంటిది ఇలా వివాదాలకి కారణమయ్యే బూతు పాటలు పాడడం ఏంటో అంటూ బాధపడిపోతున్నారు.అసలు బి ప్రాక్ గళం నుండి ఇలాంటి పాటని అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదని వాపోయారు,సినిమాలకి అయితే సెన్సార్ ఉందని, ఇక నుండి యూ ట్యూబ్ కి కూడా అలాంటి నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

చూడాలి మరి నెట్టింట్లోఅగ్నిని రాజేస్తున్న ఈ “జుగ్ని”ఎప్పుడు చల్లారుతుందో !

ఈ వివాదం నెట్టింట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. యూట్యూబ్ కు సెన్సార్ నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ‘జుగ్ని’ వివాదం ఎప్పుడు చల్లారుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.