
📌 Key Points
- జగపతిబాబుకు తృటిలో తప్పిన మరణ గండం! ‘జగపతి’ మూవీ షూటింగ్లో ఊహించని ఘటన.
- పెట్టెలో పెట్టి పూడ్చిపెట్టడంతో ఊపిరాడక సీరియస్.. ఆందోళనలో యూనిట్ సభ్యులు!
- ఆస్ట్రాలజర్ హెచ్చరిక: ఉదయం ఫోన్ చేసి మరణం గురించి చెప్పిన లేడీ ఆస్ట్రాలజర్.
- ఫ్లైట్ మిస్ కావడంతో తప్పిన ప్రమాదం! తండ్రికి మరణ గండం నుంచి బయటపడిన వైనం!
టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆయనకు జరిగిన మరణగండం గురించి స్వయంగా వెల్లడించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా!
షాకింగ్: పెట్టెలో ఊపిరాడక జగపతిబాబు అపస్మారక స్థితికి!
జగపతిబాబు ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించారు. టాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో అనే పేరు కూడా ఉంది. ఆయనతో చాలా మంది హీరోయిన్లకి ఎఫైర్లు ఉన్నాయని అంటుంటారు. కానీ అమ్మాయిలు, ఆడవాళ్లు అంటే తనకు ఇష్టమని, వారిని గౌరవిస్తానని చెబుతూ కవర్ చేసుకుంటున్నారు జగపతిబాబు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
డెస్టినీ గురించి చెబుతూ, తన మరణగండాన్ని వెల్లడించారు. తాను చనిపోవాల్సింది బతికిపోయాడట. `జగపతి` సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన బయటపెట్టారు జగపతిబాబు. ఆ మూవీ ఎండింగ్ సీన్ లో తనని పెట్టెలో పెట్టి భూమిలో పూడ్చాల్సి ఉందట. అలానే పెట్టెలో పెట్టి మేకుల కొట్టి భూమిలో పెట్టారు. దానిపై మండపం ఉంటుంది. ఆ సీన్‌ని రియల్‌గానే చేశారట. జగపతిబాబుని పెట్టేలో పెట్టి పూడ్చారు. అయితే ఆ పెట్టెకి ఏమాత్రం గ్యాప్ లేదట. దీంతో గాలి రాక ఊపిరి ఆడలేదట.
లేడీ ఆస్ట్రాలజర్ ఏం చెప్పారంటే..?
ఆ సీన్ అయిపోయిన తర్వాత తాను ఉన్న పెట్టెని భూమిలో నుంచి తీసి ఎక్కడో పెట్టి మర్చిపోయారట. దీంతో ఊపిరితీసుకోవడం కష్టంగా మారిందట. కాసేపు తర్వాత చూశారు. కాసేపటి వరకు తాను లేవకపోవడంతో అంతా షాక్ అయ్యారు. అప్పటికే తాను చనిపోనని అంతా భావించారట. ఏడవడం స్టార్ట్ చేశారట. `ఆ తర్వాత కొద్ది సేపటికి లేచాను. అయితే ఆ రోజు మరో సంఘటన జరిగింది. ఉదయం పదకొండు గంటల సమయంలో ఓ లేడీ ఆస్ట్రాలజర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె మీరు బాగానే ఉన్నారా అని అడిగింది. జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
ఆమె ఫోన్ చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ విషయం తెలిసి ఆమె మళ్లీ ఫోన్ చేసింది. మీకు మరణగండం ఉందండి, మీరు పోయేవారు అని, పోతారని భయం వేసి మార్నింగ్ ఫోన్ చేశాన`ని తెలిపిందట. అయితే ఆమె ఈ విషయాన్ని ముందే చెప్పలేదు. చెబితే జాగ్రత్త పడేవాడిని అని చెప్పారు జగపతిబాబు. తాజాగా ఆయన `రా టాక్స్ విత్ వీకే` అనే యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి విషయంలో జరిగిన సంఘటన కూడా వెల్లడించారు.
తండ్రికి తప్పిన మరణ గండం: ఫ్లైట్ మిస్ అవ్వడం వల్లే ప్రాణం నిలిచింది!
ఆయనకు ప్రతి పదేళ్లకి మరణగండం ఉందట. అయితే ఓ సారి ముంబయి నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్ రావాల్సి ఉంది. ఆ ఫ్లైట్ బయలు దేరింది, క్రాష్ అయి అంతా చనిపోయారు. కానీ నాన్న మాత్రం బతికే ఉన్నారు. కారణం ఆ రోజు ఫ్లైట్ డిలే అవుతుందని, ఆయన ఫ్రస్టేషన్‌లో టికెట్ చింపేసి వెళ్లిపోయాడట. అలా ఆ గండం నుంచి బతికి బయటపడ్డాడు. దానికి కారణం ఇంట్లో అమ్మ చేసిన పూజలే కారణమని తెలిపారు జగపతిబాబు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
జగపతిబాబు తన జీవితంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటనల గురించి పంచుకున్నారు. ఇది నిజంగానే మతిపోయే విషయమే కదా. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


