|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జగపతిబాబు, సౌందర్య మధ్య లవ్‌ ఎఫైర్‌ రూమర్‌ పుట్టింది అక్కడే, ఆ చిన్న తప్పిదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది

Published: 17-06-2025, 4:08 AM
జగపతిబాబు, సౌందర్య మధ్య లవ్‌ ఎఫైర్‌ రూమర్‌ పుట్టింది అక్కడే, ఆ చిన్న తప్పిదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది

తెలుగు సినీ ఇండస్ట్రీలో జగపతిబాబు, సౌందర్యల మధ్య ప్రేమ వ్యవహారంపై పాత రూమర్స్ ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ రూమర్స్‌ ఎలా మొదలయ్యాయో, జగపతిబాబు ఎలా స్పందించారో తెలుసుకుందాం.

Key Points

1

జగపతిబాబు, సౌందర్యల మధ్య ప్రేమ వ్యవహారంపై వార్తలు వైరల్ అయ్యాయి.

2

ఈ రూమర్స్‌కు కారణం ఏమిటో జగపతిబాబు వివరించారు.

4

జగపతిబాబు ఈ రూమర్స్‌ను అనేక సార్లు ఖండించారు.

జగపతిబాబు, సౌందర్యల మధ్య రూమర్స్

మ్యాన్లీ హీరో జగపతిబాబు ఇప్పుడు వైల్డ్ యాక్టర్‌గా మారారు. ఆయన నెగటివ్‌ రోల్స్ చేయడం స్టార్ట్ చేయడం నుంచి తనలోని మరో కోణాన్ని ఆడియెన్స్ కి పరిచయం చేస్తున్నారు. భయంకరమైన విలన్‌గా అదరగొట్టడంతోపాటు, పాజిటివ్‌ రోల్స్ తోనూ ఆకట్టుకుంటున్నాడు.

మనం చూస్తున్న అప్పటి జగపతిబాబునేనా ఇది అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. నటుడిగా చాలా ఓపెన్‌ అయ్యారు జగపతిబాబు. అయితే ఆయన్ని ఓ రూమర్‌ మాత్రం బాగా వెంటాడుతుంది. సౌందర్యతో పెళ్లి వరకు వెళ్లాడనేది బాగా ప్రచారం ఇప్పటికీ వినిపిస్తోంది.

జగపతిబాబు, సౌందర్య ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారనే టాక్‌ ఎవర్‌ గ్రీన్‌గా నడుస్తూనే ఉంది. అప్పట్లోనే ఈ రూమర్‌ బాగా విస్తరించింది. మీడియాలోకి ఎక్కింది. దీనిపై ఆ మీడియా యాజమాన్యం వద్దకు కూడా జగపతిబాబు వెళ్లారు. దీంతో కొన్నాళ్లపాటు ఆ రూమర్‌ ఆగిపోయింది.

కానీ సౌందర్య చనిపోయిన సమయంలో మరోసారి ఈ రూమర్‌ విస్తరించింది. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత మరింతగా ఇది వైరల్‌ అవుతుంది. సౌందర్యని జగపతిబాబు మ్యారేజ్‌ చేసుకోవడానికి రెడీ అయ్యాడనే ప్రశ్న తరచూ ఆయనకు ఇంటర్వ్యూలలో ఎదురవుతోంది.

దీనిపై జగపతిబాబు అనేక సార్లు క్లారిటీ ఇచ్చారు. తాను, సౌందర్య మంచి స్నేహితులమని, కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఇలాంటి రూమర్‌ వచ్చిందని ఆయన తెలిపారు.

రూమర్స్‌కు కారణాలు

అదే సమయంలో సౌందర్యనే కాదు, ఆమె అన్న అమర్‌ కూడా చాలా క్లోజ్‌ అని, అప్పట్లో తరచూ మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు. సౌందర్య ఇంటికి కూడా జగపతిబాబు వెళ్లేవాడట. `వాళ్ల పేరెంట్స్ కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు, పర్సనల్‌ విషయాలను కూడా పంచుకునే వారు.

పెళ్లైన తనతో సౌందర్య ఎఫైర్‌ పెట్టుకుంటే వారి పేరెంట్స్ నన్ను ఇంటికి రానిచ్చేవారా?` అని ప్రశ్నించారు జగపతిబాబు. ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా అసలు ఈ ఎఫైర్‌ రూమర్‌ ఎక్కడ ప్రారంభమైందో తెలిపారు.

రెండుమూడు కారణాలతో ఈ రూమర్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. ఓ సారి దర్శకుడు కోదండరామిరెడ్డిని రిసీవ్‌ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళితే, సౌందర్య వచ్చింది. అనుకోకుండా ఆమెని పిక్‌ చేసుకోవాల్సి వచ్చింది.

ఇలా ఒకటి రెండు సార్లు అనుకోకుండా కొన్ని సంఘటనలు తమ మధ్య జరిగాయి. దీంతో మన మీడియా రెచ్చిపోయింది. ఎవరికితోసింది వాళ్లు రాసుకున్నారు. అలా ఈ ఎఫైర్‌ పొగ స్టార్ట్ అయ్యిందన్నారు జగపతిబాబు.

ఓ సినిమా షూటింగ్‌లో సౌందర్యకి లెటర్‌ రాయాల్సి వస్తే, అందులో `ఐ లవ్యూ సౌందర్య` అని రాశారట అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి జగపతిబాబు స్పందిస్తూ, ఇది మరీ చిల్లరగా ఉందని, తాను సౌందర్యకి ఐ లవ్యూ రాయడమేంటి? అలాంటి చిల్లర పని తాను ఎప్పుడూ చేయను అని ఆయన స్పష్టం చేశారు. తనకు అలా రాయాల్సిన అవసరం లేదని తెలిపారు.

జగపతిబాబు స్పందన

సౌందర్య చనిపోయినప్పుడు బాధపడిన మాట వాస్తవమే అని, అంత స్నేహం ఉన్నప్పుడు అది కామన్‌గా వచ్చే రియాక్షనే అని తెలిపారు. అయితే ఆ ఘటన తెలిసినప్పుడు తాను మొదట అడిగిన ప్రశ్న అమర్‌ బతికే ఉన్నాడా ? అని,

ఆ సమయంలో అమర్‌ గురించి ఎందుకు అడుగుతాను. ఆయన్ని నేనేమైనా పెళ్లి చేసుకుంటానా అని ప్రశ్నించారు జగపతిబాబు. ఆయన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి.

అయితే ఇదే విషయంపై నటి ఆమని కూడా స్పందించింది. జగపతిబాబు, సౌందర్య మధ్య ఎఫైర్‌ లేదని, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన సౌందర్యకి లేదు, అటు జగపతిబాబుకి కూడా లేదని స్పష్టం చేసింది.

ఇక జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా భారీ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే ఇటీవల కాస్త సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు తెలుస్తోంది.

చివరగా, జగపతిబాబు ఈ రూమర్లను తోసిపుచ్చారు. అయితే, ఈ వార్తలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.