|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘జైలర్-2’ లో బాలీవుడ్ స్టార్ హీరో కామియో రోల్.. సినిమా మొత్తానికే హైలెట్‌గా మారనున్న ఆ సీన్స్! (ట్వీట్)

Published: 26-06-2025, 10:18 AM

రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ‘జైలర్-2’ షూటింగ్ జరుగుతుండగా, తాజాగా ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Key Points

ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్

కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్(Rajinikanth) ‘జైలర్’ సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్-2’ రాబోతుంది. అయితే ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి పార్ట్‌లో నటించిన నటీనటులు వసంత్ రవి, యోగిబాబు(Yogi Babu), మీర్నా మీనన్ (mirna menon), వినాయకన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వారు ఇప్పుడు ‘జైలర్-2’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తూ ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జైలర్-2’లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేయనున్నట్లు టాక్. ఆయన ఓ 15 నిమిషాల పాటు ఇందులో కనిపించనున్నారు. అయితే ఇందులో ఆయన క్యారెక్టర్ భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఆమిన్ ఖాన్ ఉన్న సీన్స్ హైలెట్‌గా నిలువనున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ‘జైలర్-2’ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది.

15 నిమిషాల కీలక సన్నివేశాలు

సినిమా విడుదల తేదీ

‘జైలర్-2’ లో ఆమిర్ ఖాన్ కామియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆగస్టు 14న విడుదలయ్యే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.