
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన “జైలర్” బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, “జైలర్ 2” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది. రజనీకాంత్ తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి పలు ఆసక్తికర వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Key Points
రజనీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రం షూటింగ్ గోవాలో విజయవంతంగా పూర్తైంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు.
రజనీకాంత్ తదుపరి సుందర్.సీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కమల్‌హాసన్ పుట్టినరోజున (నవంబర్ 7) రజనీ-కమల్ కాంబో చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం.
జైలర్ 2 షూటింగ్ పూర్తి: రజనీకాంత్ చెన్నైకి తిరిగివచ్చారు
నటుడు రజనీకాంత్( Rajinikanth) హీరోగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్ రవి,రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాప్ తదితర స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిన ఈ చిత్రంలో నటి తమన్న ఐటమ్ సాంగ్‌లో నటించారు. 2023లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా జైలర్ – 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ పలు ప్రదేశాలో జరుపుకుంది. చివరిగా గోవాలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్ తన షూటింగ్‌ను పూర్తి చేసుకుని తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు.
సుందర్.సీ దర్శకత్వంలో రజనీకాంత్ తదుపరి చిత్రం?
ఆయన్ని చెన్నై విమానాశ్రయంలో పలువురు అభిమానులు కలిసి ఫొటోలు దిగారు. కాగా రజనీకాంత్ తదుపరి సుందర్.సీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈయన చాలా కాలం క్రితం సుందర్.సీ దర్శకత్వంలో నటించిన అరుణాచలం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తాజాగా మరోసారి ఈ కాంబోలో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వినోదాన్ని మేళవించిన కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం.
రజనీ-కమల్ కాంబోలో మెగా ప్రాజెక్ట్ ప్రకటన
కాగా ఈ చిత్రం తరువాత రజనీకాంత్, కమలహాసన్ కాంబోలో చిత్రం తెరకెక్కుతుందని తెలిసింది. దీన్ని రజనీకాంత్ ,కమలహాసన్‌ల వారుసురాళ్లు, సౌందర్య రజనీకాంత్, శృతీహాసన్ కలిసి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రేజీ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను కమలహాసన్ పుట్టిన రోజు అయిన ఈ నెల 7న రజనీకాంత్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రకటన కోసం ఈ ఇద్దరు స్టార్స్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రజనీకాంత్ రాబోయే చిత్రాలపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా కమల్‌హాసన్‌తో ఆయన చిత్రం, దాని అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్తలు రజనీకాంత్ కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి.


