|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కృష్ణాష్టమి కానుకగా జైలర్ 2: రజినీకాంత్ ఫ్యాన్స్ కి పండగే!

Published: 30-03-2026, 5:35 AM
కృష్ణాష్టమి కానుకగా జైలర్ 2: రజినీకాంత్ ఫ్యాన్స్ కి పండగే!
  • రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
  • జైలర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే ప్రకటించారు.
  • కృష్ణాష్టమి సందర్భంగా జైలర్ 2 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
  • జైలర్ 2 లో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. కృష్ణాష్టమి సందర్భంగా జైలర్ 2 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జైలర్ విజయం, సీక్వెల్ ప్రకటన

Jailer 2 : సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాటకాల ద్వారా కెరియర్ మొదలుపెట్టి సినిమాలలో అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఆ తర్వాత హీరోగా తనలోని ప్రతిభను కనబరిచి.. ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. విలక్షణమైన నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన రజనీకాంత్ తన అద్భుతమైన నటనతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటూ సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన ఏడుపదుల వయసులో కూడా వరుస యాక్షన్ చిత్రాలు చేస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే..

ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆయన వరుస సినిమాలు డిజాస్టర్ ను చవిచూస్తున్న సమయంలో రజినీకాంత్ పని అయిపోయింది.. ఇక సినిమా ఇండస్ట్రీకి రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది అని చాలామంది హేళనలు చేశారు. అయితే వారందరికీ జైలర్ సినిమాతో గట్టి సమాధానం ఇచ్చారు రజనీకాంత్. ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీంతో అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

కృష్ణాష్టమికి జైలర్ 2 విడుదల?

అంటే సెప్టెంబర్ 4వ తేదీన జైలర్ 2 సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరో మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. పైగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అందుకే ఈ సినిమాను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు . త్వరలోనే దీనిపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

షారుక్ ఖాన్ కీలక పాత్ర!

జైలర్ 2 సినిమా విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో జైలర్ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మిథున్ చక్రవర్తి, ఎస్ జె సూర్య, యోగి బాబు, మీర్నా , అన్న రాజన్ , రమ్యకృష్ణ, జతిన్ సర్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికైతే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రజినీకాంత్ ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. రజనీకాంత్ తదుపరి సినిమాల విషయానికి వస్తే కమలహాసన్ నిర్మాణ సంస్థ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్న ఈయన.. మరొకవైపు కమలహాసన్ తో కలిసి ఒక మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. ఏదేమైనా వరుస సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

జైలర్ 2 సినిమా కృష్ణాష్టమికి విడుదలయ్యే అవకాశం ఉంది. షారుక్ ఖాన్ కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.