
ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం జక్కన్న నవంబర్ 15న ఓ భారీ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. 100 అడుగుల ఎత్తుతో టవర్ సెట్, రూ.20 కోట్ల ఖర్చుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది.
Key Points
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో SSMB29 సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
నవంబర్ 15న జరగనున్న పబ్లిక్ ఈవెంట్ కోసం 100 అడుగుల ఎత్తుతో భారీ LED టవర్ సెట్.
ఈవెంట్ నిర్వహణకు రాజమౌళి రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం.
జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈవెంట్‌లో సినిమా టైటిల్ ప్రకటన ఉంటుందని టాక్.
SSMB29 కోసం రాజమౌళి భారీ ప్రణాళికలు
దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ), దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 29. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు కానీ SSMB 29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మహేశ్ బాబు సినిమా కోసం భారీ సెట్ వేయిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli ). నవంబర్ 15వ తేదీన నిర్వహించబోయే పబ్లిక్ ఈవెంట్ కోసమే ఈ భారీ సెట్ ఏర్పాటు చేయిస్తున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో.. వంద అడుగుల ఎత్తుతో భారీ LED టవర్ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, రాజమౌళి, ఇతర నటీనటులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లో టైటిల్ ప్రకటన ఉంటుందని టాక్ నడుస్తోంది. జియో హాట్‌స్టార్ లో ఈ ఈవెంట్ ప్రసారం కానుంది. అయితే, ఈ ఈవెంట్ కోసం మొత్తం రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్, గెస్టులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ అనుకుంటున్నారట. క్లిక్
రూ.20 కోట్లతో అద్భుత ఈవెంట్ ఏర్పాటు
సినిమా టైటిల్ ప్రకటన ఎప్పుడంటే?
మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రియులు ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న SSMB29 సినిమాపై రాజమౌళి చేస్తున్న ఈ భారీ ప్లాన్ సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుందని చెప్పొచ్చు. టైటిల్ ప్రకటనతో అంచనాలు మరింత పెరుగుతాయి.


