|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

JanaNayagan: సింహం ఎప్పుడూ సింహమే.. విజయ్ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Published: 20-06-2025, 12:13 PM
JanaNayagan: సింహం ఎప్పుడూ సింహమే.. విజయ్ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా తాజా అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 22న ఉదయం 12 గంటలకు ‘ఫస్ట్ రోర్’ విడుదల కానున్నట్లు ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Key Points

1

జననాయగన్ సినిమా నుంచి తాజా అప్డేట్ విడుదల.

2

జూన్ 22న ఉదయం 12 గంటలకు ఫస్ట్ గర్జన.

4

అనిరుధ్ సంగీతం, కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం.

జననాయగన్ సినిమా తాజా అప్డేట్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’. విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

జూన్ 22న ఫస్ట్ లుక్ విడుదల

ఈ మేరకు ‘సింహం ఎప్పుడూ సింహమే.. అలాగే దాని మొదటి గర్జన జూన్ 22 ఉదయం 12 గంటలకు వస్తోంది.. ఫైర్ కోసం సిద్ధంగా ఉండండి’ (JanaNayaganTheFirstRoar) అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ నాయకుడిలా పిడికిలి బిగించి నిలబడగా.. అతని వెనుక ప్రజలు ఉన్నారు. దీంతో ఏ అప్టేడ్ రాబోతుందో అంటూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. కాగా.. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్

A post shared by KVN Productions (@kvn.productions)

జననాయగన్ సినిమాపై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. జూన్ 22న విడుదలయ్యే తాజా అప్డేట్‌తో సినిమాపై మరింత ఉత్సుకత పెరిగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.