
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన నానమ్మ, బోనీ కపూర్ తల్లి నిర్మల్ కపూర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఖుషీ కపూర్ మరియు శిఖర్ పహారియా కూడా ఆమెతో ఉన్నారు. 90 ఏళ్ల వయసులో నిర్మల్ కపూర్ కన్నుమూశారు.
Key Points
జాన్వీ కపూర్ తన నానమ్మ నిర్మల్ కపూర్ అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఖుషీ కపూర్ మరియు శిఖర్ పహారియా కూడా అంత్యక్రియలకు వచ్చారు.
నిర్మల్ కపూర్ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం 'దేవర' చిత్రంలో నటిస్తోంది.
నిర్మల్ కపూర్ కన్నుమూత
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. తన నానమ్మ నిర్మల్ కపూర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన చెల్లి ఖుషీ కపూర్, బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి గ్రాండ్ మదర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బోనీ కపూర్ తల్లి అయిన నిర్మల్ కపూర్ వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతూ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.
జాన్వీ కపూర్ హాజరు
బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
కాగా.. జాన్వీ కపూర్ విషయానికొస్తే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది. దేవరతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన కనిపించనుంది. బుచ్చి బాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
నిర్మల్ కపూర్ మృతితో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. జాన్వీ కపూర్ తన నానమ్మకు చివరి వీడ్కోలు చెప్పారు. ఆమెకు సంతాపం తెలిపినవారికి కృతజ్ఞతలు తెలిపారు.


