
📌 Key Points
- జానీ మాస్టర్ భార్య సుమలత (ఆయేషా) టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలిగా ఘన విజయం.
- ప్రస్తుత ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్‌ను 29 ఓట్ల మెజారిటీతో ఓడించారు.
- ఆమె ఎలాంటి గ్రూప్ మద్దతు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు.
- జానీ మాస్టర్ వివాదాల్లో ఆమె భర్తకు అండగా నిలిచి, ఇప్పుడు విజయం సాధించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా, తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. స్వతంత్రంగా పోటీ చేసి, 29 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు.
టీఎఫ్‌టీడీడీఏ ఎన్నికల ఫలితాలు
Jani Master Wife Ayesha: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ( TFTDDA ) ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఘన విజయం సాధించారు. ఆదివారం (డిసెంబర్ 7) అసోషియేషన్ కి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సుమలత 29 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థి , గత ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌ను ఓడించారు. మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో అయేషా జానీ ఎలాంటి గ్రూప్‌లు, మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలవడం విశేషం. మరోవైపు జోసెఫ్ ప్రకాశ్‌కు సీనియర్, ప్రముఖ డాన్స్ మాస్టర్లు అండగా నిలిచారు .
శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పోళ్లకి విజయ్, జోజో శామ్ , చంద్ర కిరణ్ వంటి ప్రముఖులు జోసెఫ్‌కు బహిరంగ మద్దతు తెలిపారు. అయినా ఈ ఎన్నికల్లో అయేషా గెలవడం గమనార్హం. టీఎఫ్‌టీడీడీఏ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. అందులో సుమలత జానీ మాస్టర్‌కు 228 ఓట్లు, జోసెఫ్ ప్రకాష్‌కు 199, చంద్రశేఖర్‌కు 11 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 29 ఓట్ల మెజారిటీతో సుమలత విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో తను నిలబడితే మళ్లీ కుట్రలు పన్ని అడ్డంకులు కలగజేస్తారనే అనుమానంతో జానీ మాస్టర్ తన భార్యని ప్రెసిడెంట్ రేసులో ఉంచారు. ఇక్కడ జానీ మాస్టర్ తన భార్య అయేషా ప్రెసిడెంట్‌గా నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో ఆమెకు సముచిత గౌరవాన్ని అందించారు.
సుమలత అయేషా విజయం విశేషాలు
కాగా జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్, ఆయన భార్య ఇద్దరు తనని శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది ఆమె ఆరోపణంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన సైమా, నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన భార్య సుమలత జానీ మాస్టర్ కు అండగా నిలిచారు. అంతా ఆయనని అనుమానిస్తున్న ఆమె మాత్రం తన భర్త అమాకుడంటూ జానీ మాస్టర్ మద్దతుగా ఉంది. పోలీసుల కేసుల్లో, కోర్టులో భర్త కోసం న్యాయ పోరాటం చేసింది. చివరకు జానీ మాస్టర్ నిర్దోషిగాఈ కేసు నుంచి బయటపడ్డారు.
Congratulations to my love, Master #Sumalatha , on being elected President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA) 💐
We are eternally grateful to the Founder of the union, #MukkuRaju Master, for making us a part of this family.
జానీ మాస్టర్ వివాదాలు, భార్య అండ
We… pic.twitter.com/8VHzEOsXrQ
— Jani Master (@AlwaysJani) December 8, 2025
ఎలాంటి మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేసి అయేషా సాధించిన ఈ విజయం అభినందనీయం. గతంలో జానీ మాస్టర్ వివాదాల్లో అండగా నిలిచిన ఆమెకు, ఈ విజయం వ్యక్తిగతంగా, అసోసియేషన్‌కు ఒక కీలక మలుపుగా నిలుస్తుంది.


